*పోలీస్ అవుతారా..... రాచకొండకు...... రండి*
*ఉచిత శిక్షణ కేంద్రాలకు ఏర్పాట్లు*
హైదరాబాద్: పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందాలనుకునే యువతీ, యువకులకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సారథ్యంలో శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, స్వచ్చంద సంస్థలు, దాతల సహాయంతో ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరి, కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్, ఎల్.బి.నగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో శిక్షణ కేంద్రాలు తెరవనున్నారు. గతంలో రాచకొండ పోలీస్ ద్వారా కోచింగ్ తీసుకొని 588మంది పోలీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 5 సాయంత్రం 6 గంటల్లోపు తమ సమీప పోలీస్ స్టేషన్‌లోనూ పేర్లను నమోదు చేసుకోవచ్ఛు పదోతరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, ఆధార్ కార్డు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకెళ్లాలి. పురుషులు 167.6 సెం.మీ, మహిళలు 152.5 సెం.మీ ఎత్తు ఉన్నవారు మాత్రమే పేర్లను నమోదు చేసుకోవాలి. స్థానికులకు ప్రాధాన్యం ఉంటుంది.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment