Sunday, April 24, 2022

గడీల రాజ్యం పోవాలి గరీబోళ్ల ప్రభుత్వం రావాలి....బండి సంజయ్....!

*గడీల రాజ్యం పోవాలి గరీబోళ్ల ప్రభుత్వం  రావాలి....*
*బండి సంజయ్....!*

నారాయణపేట: తెలంగాణలో గడీల రాజ్యం పోయి గరీబోళ్ల రాజ్యం రావాలని రాష్ట్ర బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా నర్వమండల కేంద్రంలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడారు.నర్వ మండలంలో మూడు రిజర్వాయర్లున్నయ్.కానీ నీళ్లు మాత్రం రావడం లేదని అన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ ఫాంహౌజ్ కు నీళ్లు తెచ్చుకోవడానికి లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి నుండి నీళ్లు తెచ్చుకుండు. ఇక్కడ 3, 4 వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావొచ్చు. కానీ కేసీఆర్ కు ఇక్కడి ప్రజలకు నీళ్లించేందుకు మనసు రాదని అన్నారు.కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో మాట్లాడి ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం చూపినం. రాష్ట్రం సహకరిస్తే 6 నెలలో నీళ్లు తీసుకురావొచ్చని అన్నారు. కేంద్రం నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించిండు.

ఈరోజు వ్యాక్సిన్ ను ఉచితంగా మోదీ అందించడంవల్లే ఈరోజు అందరం కలిసి మాట్లాడుకోగలుతున్నామని అన్నారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇవ్వడు. కానీ ఆయన కుటుంబంలో మాత్రం ఐదుగురికి పదవులిచ్చుకుని జీతమే నెలకు రూ.25 లక్షలు తీసుకుంటున్నరని చెప్పారు. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. దళిత బంధు ఇవ్వలేదు. ఈ రెండూ అమలు చేస్తే దళితులు కోటీశ్వరులు అయ్యేవారు. కేసీఆర్ వి కేవలం మాటలే తప్ప చేతల్లేవని ఎద్దేవా చేశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. గడీల రాజ్యం పోవాలి. గరీబోళ్ల ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. బాంచన్ బతుకులు కావాలా? పేదల ప్రభుత్వం రావాలా? అంటూ ఆయన ప్రజల్ని ప్రశ్నించారు. నర్వ మండలంలో బస్టాండ్ లేదు.

రోడ్లు లేవు. స్కూళ్లు లేవు.ఆసుపత్రుల్లేవ్. ఈసారి కేసీఆర్ వస్తే నిలదీయాలని ప్రజలను పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కేసీఆర్ ను గెలిపిస్తే ఏం చేసిండు? ఆత్మహత్యలు ఆగినయా? నీళ్లు వచ్చినయా? బస్టాండ్ వచ్చిందా? స్కూళ్లు లేవు...ఏం సాధించినమని అన్నారు.కేసీఆర్ మాత్రం రాజ్యమేలుతున్నడు... వేల కోట్లు దోచుకుతింటున్నడని విమర్శించారు. అమెరికా పోయి బార్లలో, పబ్బుల్లో తిరిగేటోడికి ఈ రోజు రాష్ట్ర మంత్రి అయ్యారంటే... బీజేపీ వేసిన భిక్ష మాత్రమేనని బండి సంజయ పేర్కొన్నారు.పార్లమెంట్ లో తెలంగాణకు బిల్లుకున మద్దతిచ్చి రాష్ట్రాన్ని తెచ్చింది సుష్మా స్వరాజ్ అని గుర్తు చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment