Tuesday, April 19, 2022

బహుదూర్ పుర ఫ్లైఓవర్ ను ప్రారంభించిన.....మంత్రి కేటీఆర్

*బహుదూర్ పుర ఫ్లైఓవర్ ను ప్రారంభించిన.....మంత్రి కేటీఆర్*

*పాతబస్తీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..*

హైదరాబాద్‌: పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత బహుదూర్‌పురా ఫ్లైఓవర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం రూ.495 కోట్ల విలువైన 6 పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌, ముర్గీ చౌక్‌, మీర్‌ ఆలం మార్కెట్‌ పునర్‌ నిర్మాణం, చార్మినార్‌లోని సర్దార్‌ మహల్‌ రీస్టొరేషన్‌, కార్వాన్‌ నియోజకవర్గంలో సీవరేజ్‌ పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మీర్‌ ఆలం చెరువు వద్ద మ్యూజికల్‌ ఫౌంటెన్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మొజంజాహీ మార్కెట్‌ను అభివృద్ధి చేసిన ఘనత తమదేనని చెప్పారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం రోజు సర్దార్‌ మహల్‌ పనులు ప్రారంభించామన్నారు. రూ.109కోట్లతో బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ నిర్మించినట్లు చెప్పారు. కొన్ని మెట్రో నగరాల్లో తాగునీటికి కష్టాలున్నాయని.. హైదరాబాద్‌లో మాత్రం తాగునీరు, విద్యుత్‌కి ఇబ్బంది లేదన్నారు. పాతబస్తీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న నోటరీ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కులీకుతుబ్‌షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు పూర్వవైభవం తెస్తామన్నారు.

link Media ప్రజల పక్షం 🖋️ 

No comments:

Post a Comment