హలాల్, హిజాబ్ అంశాలపై కాక ఇన్ ఫ్రా, ఐటీలపై దృష్టిపెడదాం, మన నగరాల అభివృద్ధికోసం పోటీపడదాం – కర్నాటక పీసీసీ చీఫ్ డీకే, మంత్రి కేటీఆర్ ట్వీట్ల చర్చ
ట్విట్టర్ వేదిగ్గా సవాళ్లు చేసుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్, కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఈసందర్భంగా హైదరాబాద్, బెంగళూరు అభివృద్ధిపై వారిద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగిందనే చెప్పవచ్చు.
కర్నాటకలో అధికార బీజేపీని నిందిస్తూ…”హెచ్‌ఎస్‌ఆర్, కోరమంగళ ఈ ప్రాంతాలు భారతదేశంలో సిలికాన్ వ్యాలీలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇక్కడ స్టార్టప్‌లు ఇప్పటికే బిలియన్ల డాలర్ల పన్నులను సృష్టిస్తున్నాయి. కానీ రోడ్లు చూస్తే ఇంకా అధ్వానస్థితిలో ఉన్నాయి. విద్యుత్ కోతలు, నాణ్యత లేని నీటి సరఫరా, ఉపయోగించలేని ఫుట్ పాత్‌లు ఎన్నోనగరంలో కనిపిస్తాయి. మన ఈ సిలికాన్ వ్యాలీకంటే మెరుగ్గా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలున్నాయి. ” అని ఎద్దేవా చేశారు ఒక నెటిజెన్.

అయితే ట్వీట్ కు స్పందిస్తూ..”మీ బ్యాగ్‌లు సర్దుకుని హైదరాబాద్‌కి వచ్చేయండి. మా దగ్గర మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మా విమానాశ్రయం అత్యుత్తమమైనది.. నగరంలోకి వెళ్లడం, అలాగే నగరం బయట కూడా చాలా అందంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు & సమ్మిళిత వృద్ధి పై మా ప్రభుత్వ దృష్టి ఉంది” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
దానికి స్పందించిన డీకే శివకుమార్… ” నిజమే మిత్రమా కానీ… 2023 చివరి నాటికి.. కర్నాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో, భారతదేశపు అత్యుత్తమ నగరంగా బెంగళూరు కీర్తిని పునరుద్ధరిస్తాం.” అని ట్వీట్ చేశారు.
దీనికి కేటీఆర్ బదులిస్తూ… “శివకుమార్ అన్నా, నాకు కర్ణాటక రాజకీయాల గురించి పెద్దగా తెలియదు, ఎవరు గెలుస్తారో అనేది నాకు తెలియదు.. కానీ సవాలు అంగీకరిస్తున్నా. మన యువతకు ఉద్యోగాలు కల్పించడంలో, హైదరాబాద్ , బెంగళూరు నగరాల అభివృద్ధికోసం ఆరోగ్యకరంగా పోటీపడదాం. హలాల్, హిజాబ్ అంశాలపై కాకుండా ఇన్‌ఫ్రా, IT&BT పై దృష్టి పెడదాం.” అని అన్నారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ను ప్రత్యర్థిగా భావిస్తూనే…పక్క రాష్ట్రంలోని పీసీసీ చీఫ్ తో కలిసి పనిచేద్దామని కేటీఆర్ అనడమేంటంటున్నారు నెటిజన్లు. కానీ వాళ్ల ఉమ్మడి విధానం హిందూ వ్యతిరేకతేనని స్పష్టమవుతోందని అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/KTRTRS/status/1510830605667168260?t=pa76W86On0DedLDF64fGgA&s=19
No comments:
Post a Comment