Friday, April 8, 2022

ప్రభుత్వం, గవర్నర్‌ పంచాయితీపై స్పందించిన రేవంత్‌..!

ప్రభుత్వం, గవర్నర్‌ పంచాయితీపై స్పందించిన రేవంత్‌..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య జరుగుతున్న పంచాయితీపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేవారు. గాంధీభవన్‌ లో మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్‌ పై ప్రభుత్వం నిందలు వేస్తోందన్నారు. ప్రభుత్వం, గవర్నర్‌ సఖ్యతతో పనిచేయాలని చెప్పారు. గవర్నర్‌ ఢిల్లీ పర్యటనలో కీలకమైన అంశాలు బయటకు వచ్చాయని తెలిపారు.

విద్యా వైద్య రంగాలను కేసీఆర్‌ నిర్వీర్యం చేస్తున్నారని తాము చెప్పిందే గవర్నర్‌ మీడియాకు వివరించారన్నారు రేవంత్‌. సెక్షన్‌ 8 పరిధిలో ఉన్న ఏ అంశమైనా గవర్నర్‌ ఫైనల్‌ చేయొచ్చన్న ఆయన.. గ్రేటర్‌ పరిధిలో ఏదైనా సమీక్ష చేసే అధికారం గవర్నర్‌ కు ఉంటుందని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, డ్రగ్స్‌ పై గవర్నర్‌ సమీక్ష చేయొచ్చన్నారు. తనకున్న అధికారాలు ఉపయోగించి గవర్నర్‌ అన్నింటినీ సరిదిద్దాలని కోరారు.
ప్రోటోకాల్‌ పాటించని అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్‌. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏ పార్టీ అని ఆయనకు టీఆర్ఎస్ ఓటేసిందని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ పార్టీ అని ఆయనకు ఓటేశారో చెప్పాలన్నారు. కానీ.. గవర్నర్ విషయంలో టీఆర్ఎస్ కు ఎందుకు ఈ అనుమానాలు వచ్చాయో చెప్పాలని.. రాజ్‌ భవన్‌ లో ఉగాది వేడుకలకు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ కు కోపం వస్తుందనే వారు హాజరు కాలేదని చెప్పారు.

No comments:

Post a Comment