Saturday, April 23, 2022

రియల్టర్ల మర్డర్ కేసులో ఏసీపీపై వేటు.. సీపీ సీరియస్..!

రియల్టర్ల మర్డర్ కేసులో ఏసీపీపై వేటు.. సీపీ సీరియస్..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి సస్పెండ్ అయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల హత్య కేసులో.. నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లు బాలకృష్ణారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన డీజీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

గత నెల 1న తేదీన కర్నెంగూడ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు రియల్టర్లు మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మట్టారెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో హత్య చేయించినట్లు దర్యాప్తులో తేల్చారు. మట్టారెడ్డితో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ క్రమంలో ఏసీపీ బాలకృష్ణారెడ్డి నిందితుల నుంచి డబ్బులు తీసుకున్నాడని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో కేసులో బాధ్యులను చేస్తూ.. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఎస్సై విజయ్, కానిస్టేబుల్ బాలకృష్ణలను సీపీ మహేశ్ భగవత్ బదిలీ చేశారు. అనంతరం అతనిపై అంతర్గత విచారణకు ఆదేశించారు.

ఈ  విచారణ నివేదిక ఆధారంగా.. ఏసీపీ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నేరాలకు పాల్పడే వారితో సంబంధాలు కొనసాగించడంపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment