Friday, April 15, 2022

చరిత్ర తెలియని వాడు...చరిత్ర సృష్టించలేడు

దేశభక్తి అంటే ఏమిటో తెలుసా?

Courtesy by : @daitha12 (varaprasad daitha) ట్విట్టర్ 

ఒక లాయర్ 46 మంది దోషులను ఉరి శిక్ష నుండి విడుదల చేయాలని  కోర్టులో వాదిస్తున్నారు.
అప్పుడే ఆ లాయరు సహాయకుడు వచ్చి అతని చేతిలో చిన్న చీటి పెట్టాడు.  ఆ చీటీని చూసి,  న్యాయవాది తన జేబులో పెట్టుకుని, వాదన కొనసాగించాడు.లంచ్ టైమ్ అయింది,అప్పుడు న్యాయమూర్తి లాయర్‌ని పిలిచి, 'వాదించేటప్పుడు మీకు సందేశం వచ్చింది, నేను చూశాను ఏమిటి?' అని అడిగాడు.  అప్పుడు లాయర్, 'నా భార్య చనిపోయింది జడ్జి గారు' అన్నాడు.  జడ్జి షాక్‌తో, ఆశ్చర్యంతో  'ఇక్కడేం చేస్తున్నారు, ముందు ఇంటికి వెళ్లు' అన్నారు. వెంటనే లాయర్,*"నేను నా భార్య ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేను, కనీసం ఈ 46 మంది ప్రాణాలనైనా రక్షించగలను కదా?"* అన్నాడు.
అది విన్న ఒక బ్రిటీష్ అయిన ఆ జడ్జి 46 మందిని  విడుదల చేయాలని ఆదేశించారు.
వారంతా స్వాతంత్ర్య సమరయోధులు.  ఆ న్యాయవాది మరెవరో కాదు, రాజ్యాంగ నిర్మాత *డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్*

నేడు ఆయనను ఎదిరించే స్వయం ప్రకటిత దేశభక్తులకు దేశంపై, దేశభక్తులపై అంబేద్కర్‌కు ఉన్న అభిమానం గురించి తప్పక తెలుసుకోవాలి.
ఈ వాస్తవాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి.
*చరిత్ర తెలియని వాడు*
*చరిత్ర సృష్టించలేడు*

No comments:

Post a Comment