గాంధీ ఆస్పత్రిలో నరకయాతనపడుతోన్న అక్షయ..!
కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. 14 ఏళ్ల అమ్మాయి సహా మరో ఇద్దరి గాయాలయ్యాయి. ఆ అమ్మాయికి వెన్నుపూస విరిగిపోవటంతో బంధువులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, అక్కడి వైద్యులు వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని.. దాదాపు నెల రోజులుగా అక్షయ నరకయాతన పడుతుందని బంధువులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం 25 రోజులు క్రితం తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. కర్నూల్ సమీపంలో రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు చికిత్స అనంతరం కోలుకోనగా.. 14 ఏళ్ల అక్షయ వెన్నుపూస విరిగిపోయింది.దీంతో బంధువులు మెరుగైనా చికిత్స కోసం అక్షయను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి తీరా స్టార్ట్ చేసే టైంలో.. స్క్రూ బోల్ట్స్ లేవని వైద్యులు ఆపరేషన్ చేయకుండా వెనక్కి తీసుకోచ్చారని వాపోతున్నారు.
గత 25 రోజులు లేవలేక.. ఎప్పుడు లేస్తుందో తెలియక అక్షయ నరకయాతన పడుతోంది. మరోవైపు తనకి తన కుటుంబంలో ముగ్గురు చనిపోయారనే విషయం తెలియదని.. అందరూ సేఫ్‌గా బయటపడ్డారని సంతోషంగా ఉందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వైద్యులు ఆపరేషన్ చేసి అక్షయను యథా స్థితికి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
No comments:
Post a Comment