డ్రగ్స్ కేసు పై పోలీసు అధికారులతో సి వి ఆనంద్ అత్యవసర భేటీ......!
హైదరాబాద్: బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ పట్టుబడటం, అందులో పలువురు ప్రముఖల పిల్లలు ఉండటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.అయితే, ఈకేసును తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈకేసుకు సంబంధించి వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్) రిపోర్టు కోసం పంపారు. పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి సంయుక్తంగా నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు ఈకేసును దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు డ్రగ్స్ కేసుపై పోలీసు అధికారులతో నగర సీపీ సీవీ ఆనంద్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వెస్ట్ జోన్‌లోని ఆయా పోలీస్‌స్టేషన్లకు చెందిన సెక్టార్స్ ఎస్‌ఐలు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు రిపోర్టు చేయాలని సీపీ ఆదేశించారు.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment