Wednesday, April 20, 2022

మీ వాహనంపై 3 చాలన్ల కంటే ఎక్కువ ఉంటే..... అంతే సంగతులు....!

*మీ వాహనంపై 3 చాలన్ల కంటే ఎక్కువ ఉంటే..... అంతే సంగతులు....!*

హైదరాబాద్‌: 46 రోజుల పాటు అందుబాటులో ఉన్న పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపై రిబేట్‌ అవకాశాన్ని మీరు వినియోగించుకోలేదా?మీ వాహనంపై మూడు కంటే ఎక్కువ చలాన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయా? అయితే ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పుడైనా సరే నడి రోడ్డు మీదే మీ వాహనాన్ని ఆపేస్తారు. అక్కడికక్కడే పెండింగ్‌ చలాన్‌ సొమ్ము చెల్లిస్తేనే వాహనాన్ని వదిలిపెడతారు. ఈమేరకు ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.గత నెల 1 నుంచి ఈనెల 15 తేదీ వరకూ అందించిన ట్రాఫిక్‌ చలాన్ల ఈ-లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోని వాహనదారుల ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా పెండింగ్‌ చలాన్ల డిస్కౌంట్లను రాచకొండ పరిధిలో వాహనదారులు బాగానే వినియోగించుకున్నారు. 46 రోజుల ఆఫర్‌ సమయంలో 30,63,496 వాహనదారులు చలాన్లను క్లియర్‌ చేయగా.. వీటి ద్వారా రూ.31,67,79,643 పెండింగ్‌ సొమ్ము వసూలు అయింది. ప్రస్తుతం మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, భువనగిరి మూడు జోన్లలో కలిపి 10 లక్షల వాహనాల చలాన్లు, రూ.100 కోట్లు సొమ్ము పెండింగ్‌లో ఉన్నాయి.
*3 చలాన్ల ఉన్న వాహనాలు లక్ష.*
పెండింగ్‌ చలాన్లపై రిబేట్‌ తర్వాత రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మూడు, అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌ ఉన్న వాహనాలు లక్ష వరకున్నాయి. వీటికి సంబంధించి రూ.50 కోట్ల చలాన్‌ సొమ్ము పెండింగ్‌లో ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు..

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment