Monday, April 11, 2022

విద్యార్థుల‌కు మధ్య ఘర్షణ.. వార్నింగ్ ఇచ్చిన జేఎన్‌యూ

విద్యార్థుల‌కు మధ్య ఘర్షణ.. వార్నింగ్ ఇచ్చిన జేఎన్‌యూ

Courtesy by : తొలివెలుగు మీడియా website

ఢిల్లీలోని జేఎన్‌యూ వర్సిటీలో ఆదివారం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణపై రిజిస్ట్రార్‌ ఓ లేఖ విడుదల చేశారు. విద్యార్థులు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దంటూ నోటీసులో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వర్సిటీలో శాంతికి భంగం కలిగితే సహించబోమని హెచ్చరించారు. హింసకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వీసీ చెప్పార‌ని ఆ లేఖ‌లో రిజిస్ట్రార్ తెలిపారు.

శ్రీరామ‌న‌వ‌మి పూజ‌ సందర్బంగా ఆదివారం వర్సిటీలో ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సంఘాల విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ తలెత్తింది. యూనివర్సిటీ మెస్‌లో మంసాహారం వడ్డించటంతో ఈ ఘర్షణ జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలో దాదాపు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు సంఘటన స్ధలానికి చేరుకొని, ఇరుసంఘాల విద్యార్థులను అదుపు చేశారు.కాగా, క్యాంపస్‌లోని కావేరీ హాస్టల్‌ మెస్‌లో మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్‌యూ స్టూడెంట్స్‌ యూనియన్‌ (జేఎన్‌యూఎస్‌యూ) కార్యకర్తలు ఆరోపించారు. క్యాంపస్‌లో రామనవమి పూజకు జేఎన్‌యూఎస్‌యూ నేతలు ఆటంకాలు సృష్టించారని ఏబీవీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రగడ మొదలయ్యింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘర్షణల నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు వెల్లడించారు. జేఎన్‌యూఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్‌, ఏఐఎస్ఏ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు గుర్తు తెలియ‌ని ఏబీవీపీ విద్యార్తుల‌పై కేసు బుక్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్‌ మనోజ్‌ తెలిపారు.

No comments:

Post a Comment