Wednesday, April 27, 2022

బీఆర్‌ఎస్‌ గా టీఆర్‌ఎస్‌! కేసీఆర్‌ కు అంత సీన్‌ ఉందా?

బీఆర్‌ఎస్‌ గా టీఆర్‌ఎస్‌! కేసీఆర్‌ కు అంత సీన్‌ ఉందా?

-- దేశ్ కీ పార్టీపై కేసీఆర్‌ పరోక్ష వ్యాఖ్యలు
– భారత రాష్ట్ర సమితి అంటూ హింట్‌
– ఒకవేళ బీఆర్‌ఎస్‌ వస్తే నెట్టుకొస్తారా?
– ఉన్న ఎంపీ సీట్లెన్ని?
– మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీలెన్ని?
– కేసీఆర్‌ కన్ఫ్యూజన్‌ లో ఉన్నారా?

ప్లీనరీ సమావేశం అంటే ఏం చేస్తారు.. తమ పార్టీ బలోపేతం..సాధించిన విజయాలు ప్రజలకు అందిన ఫలాల గురించి చర్చిస్తారు. ఆ విధంగానే తీర్మానాలను కూడా ఆమోదం తెలుపుతుంటారు. కానీ.. మన దేశ్‌ కీ నేత కేసీఆర్‌ మాత్రం అలాకాదు.. 11 తీర్మానాలు చేస్తే అందులో 9 కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్‌ చేసేవే ఉన్నాయి. అయితే.. తమ భవిష్యత్ కార్యాచరణ అంతా కేంద్రంపై యుద్ధమనే సంకేతాలను కేసీఆర్‌ ఇలా ఇచ్చారని అంటున్నారు గులాబీ శ్రేణులు. తీర్మానాల సంగతి పక్కనపెడితే.. ప్లీనరీలో ముఖ్యంగా హైలెట్‌ అయిన అంశం భారత రాష్ట్ర సమితి.

ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అంటూ కొద్ది రోజులు హడావుడి చేశారు కేసీఆర్‌. కానీ.. ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరూ ఆయన్ను పట్టించుకోలేదు.కాంగ్రెస్‌ లేని కూటమి కష్టమని కొందరు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అదే సమయంలో అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడితే తప్పేంటని అన్నారు కేసీఆర్‌. దీంతో ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని.. ప్లీనరీలో కీలక ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. అందరూ ఎంతో ఆసక్తిగా కేసీఆర్‌ ప్రసంగం కోసం ఎదురుచూశారు. కానీ.. ఆయన ప్రసంగం చూసిన తర్వాత చల్లబడ్డట్టే అనిపించిందనే విమర్శలు వస్తున్నాయి. జాతీయ పార్టీ ప్రకటన లేకపోయినా పరోక్షంగా మాత్రమే కేసీఆర్‌ హింట్‌ ఇచ్చారు.

No comments:

Post a Comment