Monday, April 25, 2022

_మలేషియా అంతర్జాతీయ విశ్వ విద్యాలయం 'బ్రాండ్ అంబాసిడర్ గా అనంచిన్ని శ్రీరాం

*_మలేషియా అంతర్జాతీయ విశ్వ విద్యాలయం 'బ్రాండ్ అంబాసిడర్ గా అనంచిన్ని శ్రీరాం'_*
★  'ఫ్లై గ్రాడ్యుయేట్' సహకారం
★ ఏడాదికి రూ.25 లక్షల స్కాలర్ షిప్
★ నిరాడంబరంగా జీవిస్తున్న నా తల్లిదండ్రుల ఆశయం కొనసాగిస్తా
★ 'అనంచిన్ని ఫౌండేషన్'కి వారసత్వంగా వచ్చిన ఆస్తికి తోడుగా నా తొలి సంపాదన వచ్చిన కోటి ఇస్తున్న


అనంచిన్ని కోదండ శ్రీరామ్ పరమాత్మ మలేషియాలోని ఐ.ఎన్.టి.ఐ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బ్రాండ్ అంబాసిడర్ గా అనంచిన్ని కోదండ శ్రీరాం పరమాత్మ ఎంపికయ్యారు.

శ్రీరాం యూనివర్సిటీ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూ అమెరికన్ డిగ్రీ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్‌, బయో టెక్నాలజీ కోర్సును రెండేళ్ల పాటు మలేషియాలో, మరో రెండేళ్లు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించనున్నారు. ఈ నాలుగు సంవత్సరాలపాటు శ్రీరాంకు ఏడాదికి రూ. 25 లక్షల చొప్పున కోటి రూపాయల స్కాలర్ షిప్ ను మలేషియా అంతర్జాతీయ యూనివర్సిటీ  అందించనున్నది. సోమవారం మధ్యాహ్నం శ్రీరాం మలేషియా చేరుకున్నారు. ఈ సందర్భంగా మలేషియా అంతర్జాతీయ విశ్వవిద్యాలయం డీన్ బ్రెండన్, విశ్వవిద్యాలయ డైరెక్టర్లు  ప్రత్యేకంగా శ్రీరాంను మలేషియా విమానాశ్రయానికి వచ్చి అభినందించారు.

*ఆదర్శంగా మారితే...:!*
ఐ.ఎన్.టి.ఐ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ గత 32 సంవత్సరాల నుండి సేవలందిస్తున్నాయి. భారతదేశం నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయిన తొలి విద్యార్థి శ్రీరాం కావడం గమనార్హం. అమెరికాలోని  287 విశ్వ విద్యాలయాలలో మొదటి స్థానంలో ఉన్న అమెరికా విశ్వవిద్యాలయం ద్వారా అనంచిన్ని శ్రీరాం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు ఇప్పటికే ఆహ్వానం అందింది.

*కృతజ్ఞతలు ఎందుకంటే..?:*
తనకు పూర్తి సాంకేతిక సహకారం అందించిన హైదరాబాద్, అమీర్ పేటలోని 'ప్లై గ్రాడ్యుయేట్' సంస్థ యాజమాన్యానికి, సికింద్రాబాద్ సెంట్ ప్యాట్రిక్స్ లో 10వ తరగతి వరకు, న్యూ చైతన్యలో ఇంటర్, విదేశీ విద్య కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఖమ్మంకు చెందిన రెజోనెన్స్ విద్యా సంస్థ యాజమాన్యాలకు, బోధన సిబ్బందికి కృతజ్ఞతలు.

*ఇదే నా ఆశయం:*
ముఖ్యంగా నాతో పాటు లక్షలాది మందికి తన ప్రాణాలను తృణపాయంగా భావించి అభాగ్యులకు తన గొంతకను, అవినీతికి వ్యతిరేకంగా, తన అక్షరాలను సరస్వతి దేవికి త్యాగాల మాలగా అందిస్తూ.. ఆత్మగౌరవ తెలంగాణ కోసం ఆరాటపడుతున్న నా తండ్రి, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావుకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వందల కోట్ల ఆస్తి ఉన్నా.. ఓ సామాన్యుడిలా బతికే నా తండ్రి, అలాంటి త్యాగాలతో బతికిన నాతాత‌, ముత్తాతలు, అమ్మలు, నాన్నమ్మలు నాకు ఆదర్శం. నా తండ్రి చెప్పినట్లు ఈ ప్రపంచాన్ని జయించడానికి వెళుతున్న. విజయంతో రావాలని నన్ను దీవించండి. నా విజయం నిశ్శబ్దం. నామాట ఎంత భయకంరంగా ఉంటుందంటే.. నాన్నను కష్ట పెట్టిన వాళ్ళ గుండెల్లో జస్ట్ ఇది డైనమైట్. మిస్సైల్ లా వస్తా. ఇది నేను నా భారతమాతకు మాటిస్తునన్నా. నా భారతీయులకు మాట ఇస్తున్న. నా తండ్రి నాకు ఇచ్చిన ఎంతో విలువైన భూ బహుమతితో పాటు, నా నాలుగేళ్ళ స్కాలర్ షిప్ నగదు కోటి మొత్తాన్ని నా తండ్రి సూచనల మేరకు పేదోళ్ళ కోసం మాత్రమే 'అనంచిన్ని ఫౌండేషన్' కార్యక్రమాలకు ఇస్తున్న' అని అనంచిన్ని కోదండ శ్రీరాం పరమాత్మ ప్రశాంతంగా పేర్కొన్నారు.

No comments:

Post a Comment