Thursday, April 21, 2022

కేటీఆర్‌ కు శ్రవణ్‌ కౌంటర్‌..!

కేటీఆర్‌ కు శ్రవణ్‌ కౌంటర్‌..!

వరంగల్‌ టూర్‌ లో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ప్రతిపక్షాలు ఆయనపై విమర్శల దాడికి దిగాయి. ఫ్రస్ట్రేషన్ తో ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల మీదే చర్చ జరిగేలా కేటీఆర్‌ మాట్లాడారన్నారు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి.. ఈ తిట్ల రాజకీయం ఏంటని ప్రశ్నించారు.

వరంగల్  టూర్లో  కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ప్రతిపక్షాలు ఆయనపై విమర్శల దాడికి దిగాయి. ఫ్రస్ట్రేషన్ తో ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల మీదే చర్చ జరిగేలా కేటీఆర్‌ మాట్లాడారన్నారు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి.. ఈ తిట్ల రాజకీయం ఏంటని ప్రశ్నించారు.

111 జీవోపై 2016లో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారని.. 2022 మార్చి 31న రిపోర్ట్ ఇచ్చినట్టు జీవోలో పేర్కొన్నారని చెప్పారు. అందులో పొందుపరిచిన అంశాలు బహిర్గతం చేయాలన్నారు శ్రవణ్.ఇదేమన్నా సొంత పని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రెండు జలాశయాలు మరో హుస్సేన్ సాగర్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఆగమేఘాల మీద 111 జీవో ఎత్తేసి.. అక్కడున్న జలాశయాలు పర్యావరణాన్ని కాపాడేలా కమిటీ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి అసలు సోయి ఉందా? అని నిలదీశారు.
111 జీవో పరిధిలో ఉన్న భూమిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వారికి లబ్ధి చేకూర్చేందుకే జీవో ఎత్తేశారని మండిపడ్డారు.రెండు జలాశయాలను ఎండగట్టే కుట్ర చేస్తున్నారని ఫైరయ్యారు శ్రవణ్‌. 69 జీవో హైకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జలశయాలను ఎలా కాపాడతారో గైడ్ లైన్స్‌ ను బహిర్గం చేయాలన్నారు.

No comments:

Post a Comment