*దాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి..... రేవంత్ రెడ్డి......!*
హైదరాబాద్: ఈ రోజు మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై ప్రభుతం ఒక నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... 24 గంటలలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోలును ప్రారంభించాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకుని రైతులకు భరోస కల్పించకపోతే ఎక్కడికక్కడ మంత్రులను, టీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, టీఆర్ఎస్‌లు ఆడుతున్న దొంగ నాటకాలు కట్టిపెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి చివరి వరి గింజ వరకు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాటం చేసి వారికి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment