Thursday, April 14, 2022

హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు? - అభిప్రాయం

Ambedkar Jayanti: హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు? - అభిప్రాయం

Courtesy by : BBC తెలుగు మీడియా 
  • డాక్టర్ సిద్ధార్థ్
  • సామాజికవేత్త, బీబీసీ కోసం

భీమ్‌రావ్ అంబేడ్కర్

భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనే కల ఇటీవలి కాలానిదేమీ కాదు. కాకపోతే అది ఈ మద్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ సంఘాలు జాతీయగీతం, బీఫ్, గోరక్షణ, రామమందిరం వంటి వాటిపై చూపుతున్న దూకుడు ధోరణి దానికే ముందస్తు సంకేతాలు.

గోహత్యను నిషేధించే చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వాదిస్తున్నారు. రిజర్వేషన్లపై పునస్సమీక్ష చేయాలనే ప్రకటన కూడా ఆయన గతంలో చేసి ఉన్నారు.

హిందూ సంస్కృతిని భారతదేశమంతటా ఆదర్శ జీవన నియమావళిగా మార్చాలనేది సంఘ్ ప్రకటిత లక్ష్యం. మహిళలకు డ్రెస్ కోడ్, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ వంటి వాటిని వారు నడిపిస్తూనే ఉన్నారు.

నిజానికి ఇస్లామ్ ఆధారిత ప్రత్యేక దేశం, హిందూ దేశం రెండు డిమాండ్లూ కవల పిల్లల్లాగే పుట్టాయి. ఇవి రెండూ పరస్పరం మద్దతు ఇచ్చుకున్నాయి.

ఫొటో సోర్స్,THINKSTOCK

మత ఆధారిత దేశం

వాస్తవం ఏంటంటే హిందూ మెజారిటీ పాలనా భయం నీడలోనే పాకిస్తాన్ కావాలనే డిమాండ్ పుట్టి, పెరిగి పెద్దధైంది.

డాక్టర్ అంబేడ్కర్ 1940లో మత ఆధారిత పాకిస్తాన్ దేశం కోసం చేస్తున్న డిమాండ్‌ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఇలా అన్నారు - "ఒకవేళ హిందూ దేశం ఏర్పడినట్టయితే అది దేశానికి భారీ ప్రమాదం అవుతుందనడంలో అనుమానం లేదు. హిందువులు చెప్పేది ఏమైనా కావొచ్చు కానీ, హిందుత్వ అనేది స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న భావనలకు ప్రమాదకరం. అలా చూసినపుడు ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం అనుగుణమైంది కాదు. ఎట్టి పరిస్థితిలోనైనా సరే హిందూ రాజ్యం ఏర్పాటును వ్యతిరేకించాలి."

81ఏళ్ల క్రితం అంబేడ్కర్ ఏ ప్రమాదం గురించి హెచ్చరించారో, అది నేడు భారతదేశం ముంగిట్లోకి శక్తిమంతంగా వచ్చి నిలుచుంది.

రాజ్యాంగంలో మార్పేమీ జరగనప్పటికీ, లాంఛనంగా మనది ఇంకా లౌకికవాద దేశమే అయినప్పటికీ, వాస్తవిక జీవితంలో మాత్రం హిందుత్వవాద శక్తులు సమాజం, సంస్కృతులతో పాటు అధికార పీఠంపైనా బలమైన పట్టు సాధించాయి.

హిందూ రాజ్యం హిందువులకే ఎక్కువ ప్రమాదకరం'

ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, భారత్‌ను హిందూ దేశంగా మారిపోకుండా అడ్డుకోవాలని అంబేడ్కర్ భావించారు. ఎందుకంటే హిందూ జీవన నియమావళి స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలకు పూర్తిగా విరుద్ధమైందని ఆయన భావించేవారు.

హిందూ రాజ్యాన్ని ఆయన వ్యతిరేకించడానికి కారణం ముస్లింల పట్ల హిందువులు కలిగి ఉన్న ద్వేషానికే పరిమితం కాదు.

వాస్తవం ఏంటంటే, 'హిందూ రాజ్యం ముస్లింలకన్నా, హిందువులకే ఎక్కువ ప్రమాదకరం' అని ఆయన భావించేవారు.

ఆయన హిందూ రాజ్యం దళితులకూ, మహిళలకూ వ్యతిరేకమైందని భావించారు. కుల వ్యవస్థను నిలబెట్టి ఉంచడానికి అనివార్యమైన షరతు మహిళలు కులాంతర వివాహాలు చేసుకోకుండా వారిని అడ్డుకోవడమే అని ఆయన స్పష్టంగా చెప్పారు.

హిందుత్వ, ప్రజాస్వామ్యం

ఈ పరిస్థితిని అడ్డుకునేందుకే ఆయన హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు. హిందూ రాజ్యాన్ని ఆయన పెను ప్రమాదంగా భావించడం వెనుక కుల వ్యవస్థ నుంచి తలెత్తిన అసమానత్వం ఒక పెద్ద కారణం. అది స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం వంటి విలువకు గొడ్డలిపెట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ అసమానత్వం ఇలా ఉండడం వల్ల వాస్తవిక స్వాతంత్ర్యం మనుగడలో ఉండలేదు. సమానత్వం, స్వాతంత్ర్యం వంటివి లేనప్పుడు సామాజిక సౌభ్రాతృత్వాన్ని ఊహించనే లేం.

కులవాద అసమానత్వం హిందుత్వకు ప్రాణం వంటిది. ఈ అంశం ఆధారంగానే ఆయన "హిందుత్వ, ప్రజాస్వామ్యం రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు" అనే నిర్ధారణకు వచ్చారు.

కులపరమైన అసమానత్వం విషయంలోనైనా, దీనిని నిలిపి ఉంచడం కోసం మహిళలు వర్ణానికీ, కులానికీ ఆవల జీవిత భాగస్వామిని ఎంచుకోకుండా వారిని నియంత్రించే విషయంలోనైనా హిందువుల్లో మౌలికమైన మార్పేమీ రాలేదు.

మొత్తంగా చూస్తే, హిందువులు దేన్నైనా వదులుకుంటారు కానీ తమ మూలాధారమైన కులాన్ని మాత్రం వదులుకోరు. దీనిని నిర్మూలించకుండా ప్రజాస్వామిక సమాజాన్ని ఊహించను కూడా ఊహించలేమని అంబేడ్కర్ ఆనాడే భావించారు.


No comments:

Post a Comment