Friday, April 15, 2022

పిల్లలపై కరోనా పంజా… వారంలో వైరస్ బారిన 44 మంది

పిల్లలపై కరోనా పంజా… వారంలో వైరస్ బారిన 44 మంది

Courtesy by : తొలివెలుగు మీడియా website

కరోనా మరోసారి పడగ విప్పుతోంది. మొన్నటి దాకా కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించినా మళ్లీ ఇప్పుడు కరోనా తన పంజావిసురుతోంది. ఇటీవల నోయిడాలో పెరుగుతున్న కేసులు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం రోజుల్లో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం అధికారులను కలవర పెడుతోంది.

గత వారం రోజుల్లో రాష్ట్రంలో 44 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా తేలినట్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. వారిలో 18 ఏండ్లలోపు వారు 14 మంది ఉన్నట్టు తెలిపింది. మొత్తం యూపీలో ఒవరాల్ కేసులు 167 నమోదు కాగా అందులో 26.3 శాతం మంది పిల్లలు ఉన్నట్టు పేర్కొంది.

దీంతో నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలలకు యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో దగ్గు, జ్వరం, డయేరియా లేదా ఏవైనా కొవిడ్ లక్షణాలు కనిపించినా వెంటనే వారి వివరాలను ఆరోగ్య శాఖకు తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇక పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీచేసింది. పాఠశాలలో ఏ విద్యార్థికైనా లేదా సిబ్బందిలో ఎవరికైనా కొవిడ్ పాజిటివ్ తేలితే ఆ పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది. విద్యార్థులు, సిబ్బంది ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని వైద్యారోగ్యశాఖ సూచనలు చేసింది.

No comments:

Post a Comment