Monday, May 10, 2021

వైద్య సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్‌

వైద్య సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్‌

నమస్తే తెలంగాణ మీడియా (ట్విట్టర్)

22 వరకు దరఖాస్తులకు అవకాశం               

డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు తదితర వైద్యారోగ్య సిబ్బంది భర్తీకి ఆ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పుడున్న వైద్య సిబ్బందిపై భారం తగ్గించటం, రోగులకు మెరుగైన సేవలందించాలన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పెద్దసంఖ్యలో సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్‌ మెడికల్‌ ఆఫీసర్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించింది.

ఆసక్తి గల
అభ్యర్థులు health.telan gana.gov.in లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగం జీతం

మెడికల్‌ ఆఫీసర్‌- స్పెషలిస్ట్‌ రూ.లక్ష
మెడికల్‌ ఆఫీసర్‌- ఎంబీబీఎస్‌ రూ.40వేలు
మెడికల్‌ ఆఫీసర్‌- ఆయుష్‌ రూ.35వేలు
స్టాఫ్‌ నర్స్‌ రూ.23వేలు
ల్యాబ్‌ టెక్నీషియన్‌ రూ.17వేలు

No comments:

Post a Comment