హైదరాబాద్ : 24/05/2021
కేసీఆర్.. మరి ఈ ఎమ్మల్యేలను ఏం చేస్తారు?
‘కన్న కొడుకు అవినీతి చేసినా సహించను‘ అంటూ చెప్పుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. కనీసం పార్టీ నేతలు చేసే అక్రమాలు కూడా కనిపించడం లేదు. వరుసపెట్టి ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోతున్నా.. చర్యలు కాదు కదా కనీసం విచారణకు ఆదేశించడం లేదు. దీంతో అదే తమ అవినీతికి కేసీఆర్ ఇస్తున్న గ్రీన్ సిగ్నల్‌గా భావిస్తున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మరింత రెచ్చిపోతున్నారు. ఒకరిని చూసి మరొకరు పోటీపడి మరీ అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఇక నగరానికే చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌పై తాజాగా భూఆక్రమణ ఆరోపణలు వస్తున్నాయి. కొంపల్లిలోని రంగారెడ్డి బండ అనే ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలోని క్వారీ గుంత స్థలాన్ని ఆయన ఆక్రమించుకున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్ఎస్‌యూపై నేత ఒకరు అక్కడికి వెళ్లి అక్కడ జరుగుతున్న తతంగాన్ని బయటపెట్టారు. ఈ భూవివాదంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ జోక్యం ఉందని, చేసుకున్నారని.. స్వయంగా స్థానిక వీఆర్వోనే స్పష్టం చేస్తున్నారు. ఆలెక్కన అసైన్డ్ భూములను డబ్బులిచ్చి కొనుగోలు చేసిన ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్.. భూవివాదంలో తలదూర్చిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ప్రభుత్వ భూమినే కబ్జా చేయబోయిన ఎమ్మెల్యే వివేకాంద గౌడ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈటల విషయంలో అలా ఫిర్యాదు చేస్తే ఇలా విచారణకు ఆదేశిస్తున్న ముఖ్యమంత్రి.. వీరి వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చేదాకా ఆగుతారా.. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిల విషయంలోలా చూసీచూడనట్టు వదిలేస్తారా చూడాలి.
No comments:
Post a Comment