సిబ్బందిలో కొత్త ఉత్సాహం
- సీఎం సందర్శన మనోనిబ్బరాన్ని నింపింది
- వెంటిలేటర్‌పై ఉన్న రోగికూడా లేచి మాట్లాడాడు
- గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
హైదరాబాద్ సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ)ట్విట్టర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ దవాఖాన సందర్శన వైద్యులు, సిబ్బందిలో మనో నిబ్బరాన్ని, రోగుల్లో భరోసాను నింపిందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. సీఎం వస్తున్నారనగానే వైద్య సిబ్బందిలో కొత్త ఉత్తేజం కనిపించిందని చెప్పారు. అందరూ సంతోషం వ్యక్తంచేశారని, ఇక రోగుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన ఘటనగా వారు ఫీలయ్యారని.. ఒక సీఎం వచ్చి ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న రోగి యోగక్షేమాలు అడగడం నిజంగా ఊహించనిదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను చూడగానే సీ-టాప్ వెంటిలెటర్‌పై ఉన్న పేషెంట్లు కూడా గుర్తుపట్టడం, వారంతట వారే లేచి మాట్లాడటం.. చేతులెత్తి నమస్కరించడం చాలా ఆశ్చర్యమేసిందని అన్నారు. సాధారణంగా వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్స్ లేవలేరని, సీఎంను చూడగానే ఎైగ్జెట్‌మెంట్‌కు గురైనవారు చాలా ఆనందించారని తెలిపారు. సీఎం కేసీఆర్ దవాఖానలోని ఎమర్జెన్సీ, జనరల్ వార్డులన్నీ కలియతిరిగారు. వైద్యసిబ్బంది, నర్సులు, స్వీపర్లు, ఇలా ప్రతిఒక్కరితోనూ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని, దానికి సంబంధించిన పూర్తివివరాలను అందజేయాలని సూచించారని తెలిపారు. రెండ్రోజుల్లో వివరాలను సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తానని డాక్టర్ రాజారావు తెలిపారు.
No comments:
Post a Comment