హైదరాబాద్ : 16/05/2021
నా భర్త మృతదేహాన్ని ఇంట్లోకి తేవద్దు
- ఆస్తి తగాదాలతో అడ్డుకున్న భార్య
- అర్ధరాత్రి రోడ్డుపై అనాథగా మృతదేహం
- ఛత్రినాక పోలీసుల జోక్యంతో ఇంట్లోకి
చాంద్రాయణగుట్ట, మే 15: ఆస్తి తగాదాలతో కట్టుకున్న భర్త మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు ఓ ఇల్లాలు. కరోనా కాలంలో గుండెపోటుతో భర్త మరణించినా పట్టించుకోలేదు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడలో చోటుచేసుకున్నది. లలితాబాగ్ ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాల నడుపుతున్న లలిత, భిక్షపతిగౌడ్ భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లలిత, భిక్షపతిగౌడ్ మధ్య రెండేండ్లుగా ఆస్తుల కోసం గోడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. ఆస్తులకు సంబంధించిన కేసు కోర్టులో ఉన్నది. భిక్షపతి తన కొడుకు అభిలాష్ వద్ద ఉంటున్నట్టు సమాచారం. శుక్రవారం రాత్రి 10 గంటల తరువాత ఒక్కసారిగా అనారోగ్యానికి గురైన భిక్షపతికి గుండెనొప్పి రావడంతో మృతిచెందారు. దీంతో బంధువులు మృతదేహాన్ని భార్య లలిత ఉంటున్న ఇంటికి అర్ధరాత్రి 12 గంటల సమయంలో తీసుకెళ్లారు. తమ మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని, మృతదేహాన్ని ఇంటిముందు పెట్ట వద్దని ఆమె మొండికేయడంతో మృతదేహాన్ని పాఠశాల ముందు రోడ్డుపైనే అనాథగా వదిలేశారు. ఛత్రినాక పోలీసులు, స్థానికులు కలుగజేసుకొని నచ్చజెప్పడంతో చివరకు మృతదేహాన్ని ఇంటి గేటు లోపలికి అనుమతిచ్చారు. శనివారం అంత్యక్రియలు పూర్తిచేశారు
No comments:
Post a Comment