Wednesday, May 19, 2021

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుధ్ధ వాతావరణం ఏ మాత్రం సడలలేదు.

హైదరాబాద్ : 19/05/2021

గాజా సిటీలో మరణ మృదంగం, 215 మంది మృతి, ఆ కుటుంబమంతా మృత్యుముఖంలోకి, 5 నెలల చిన్నారి క్షేమం

    

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుధ్ధ వాతావరణం ఏ మాత్రం సడలలేదు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 215 మంది మరణించారు. వీరిలో 100 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.

Tv9తెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)


ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుధ్ధ వాతావరణం ఏ మాత్రం సడలలేదు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 215 మంది మరణించారు. వీరిలో 100 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ దాడుల్లో ఓ కుటుంబంలోని కుటుంబ పెద్ద, 5 నెలల బాలుడు క్షేమంగా బతికి బయట పడ్డారు. ఈ ఘటనలో తన నలుగురు పిల్లలతో బాటు ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్త, ఈ చిన్నారి గాయపడకుండా తప్పించుకున్నారు. మరణించిన తల్లి చేతుల్లో ఉన్న చిన్నారిని శిథిలాల నుంచి బయటకు తీశారు. ఈ శిశువు కాళ్లపై చిన్న గాయాలున్నాయి.నా భార్యా పిల్లలు ప్రాణాలు కోల్పోయారని, ఈ బాలుడి కోసమైనా నేను బతకాలని 37 ఏళ్ళ ఆ తండ్రి విలపిస్తూ చెప్పాడు. ఈ మధ్య రంజాన్ పండుగను కొంత ఉత్సాహంగా జరుపుకున్న ఆ కుటుంబంలో ఇప్పుడు విషాదం తాండవిస్తోంది.గాజా సిటీ నుంచి హమాస్ ప్రయోగించిన రాకెట్ దాడుల్లో 10 మంది ఇజ్రాయెలీలు మృతి చెందారు. కాల్పుల విరమణను పాటించాలని అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ రెండు సార్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కోరినప్పటికీ ఆయన నుంచి స్పందన లేదు. దీనిపై నెతన్యాహు ఎలాంటి హామీని ఇవ్వలేదు సరికదా.. పాలస్తీనాపై తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్ఛరించారు.హమాస్ టెర్రరిస్టులు వెనక్కి తగ్గేంతవరకు తాము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు.

మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ కూడా ఇజ్రాయెల్ పై తమ ఉగ్రవాదులు రాకెట్లను ప్రయోగిస్తునే ఉంటారని, ఇజ్రాయెల్ కండకావరాన్ని తాము సహించబోమని హెచ్చరించారు. ఉభయపక్షాలూ శాంతి చర్చలకు రావాలని ఐక్యరాజ్య సమితి కోరినప్పటికీ ప్రయోజనం లేకపోతోంది.

No comments:

Post a Comment