హైదరాబాద్ : 19/05/2021
లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలి... డీజీపీ!
కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30 వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడగించినందున మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. లాక్‌డౌన్ అమలుపై జోనల్ ఐజిలు, డిఐజిలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పిలతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్ డిజిపి జితేందర్, ఇంటలిజెంట్స్ విభాగం ఐజి ప్రభాకర్ రావులు పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు తీరును ప్రతిరోజు జిల్లాల వారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు అని తెలిపారు. మే 30 వ తేదీ తరవాత తిరిగి లాక్‌డౌన్‌ను పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల దగ్గర పెద్దఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తుందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుంచే తమ అవసరాలకై వెళ్లేవిధంగా ప్రజలను చైతన్యపర్చాలని డీజీపీ సూచించారు.

*link Media ప్రజల పక్షం🖋️*
No comments:
Post a Comment