Monday, May 17, 2021

లాక్‌డౌన్‌, కరోనా నిబంధన అమలులో పోలీసుల పనితీరు భేష్‌ : హైకోర్టు

హైదరాబాద్ : 17/05/2021

లాక్‌డౌన్‌, కరోనా నిబంధన అమలులో పోలీసుల పనితీరు భేష్‌ : హైకోర్టు

లాక్‌డౌన్‌, కరోనా నిబంధన అమలులో పోలీసుల పనితీరు భేష్‌ : హైకోర్టు


రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్‌లోనూ ఇదే రీతిలో పనిచేయాలని సూచించింది. తెలంగాణలో లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ, కరోనా నిబంధనల అమలు తీరుపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. విచారణకు హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ సీపీలు హాజరయ్యారు. లాక్‌డౌన్‌, కరోనా నిబంధనల అమలు తీరుపై డీజీపీ కోర్టుకు నివేదిక సమర్పించారు.

‘‘ఔషధాల బ్లాక్‌ మార్కెట్‌పై 98 కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ దవాఖాన వద్ద 57 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ నెల 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు చేశాం. మాస్కులు లేని వారిపై 3,39,412 కేసులు నమోదు చేసి రూ. 31 కోట్ల జరిమానా విధించాం. భౌతికదూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశాం. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు పెట్టాం’’ అని డీజీపీ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసుల పనితీరును అభినందించింది.

No comments:

Post a Comment