19/05/2021
గుడ్ న్యూస్- హైదరాబాద్ కేంద్రంగా అందుబాటులోకి మరో వ్యాక్సిన్
కరోనాపై పోరులో మరో కీలక అడుగు పడనుంది. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ స్పీడప్ ఒక్కటే పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్న సమయంలో ఇండియాలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన వ్యాక్సిన్ ను హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి ప్రారంభించనున్నారు. బయోలాజికల్ ఈ కంపెనీ సంవత్సరానికి 60కోట్ల డోసులను ఉత్పత్తి చేయనుంది.
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వ్యాక్సిన్ కు ఇప్పటికే అమెరికా సహా పలు దేశాల్లో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కు అనుమతించాయి. త్వరలో ఇండియాలో కూడా అనుమతి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో… హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఎప్పటి నుండి ఉత్పత్తి ప్రారంభిస్తారు, ఎప్పటి నుండి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులో ఉంటుందనేది మాత్రం వెల్లడించలేదు.
ఇప్పటికే రష్యా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డా.రెడ్డీస్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు రష్యా నుండి దిగుమతి చేసుకొని వ్యాక్సినేషన్ ను కూడా స్పీడప్ చేసింది. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తో పాటు బయోలాజికల్ ఈ కంపెనీ స్వయంగా మరో కరోనా వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తుంది. త్వరలో ఆ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ఇక ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉండగా, ముక్కులో వేసే నాసల్ వ్యాక్సిన్ ను కూడా ఈ సంస్థ తయారు చేస్తుంది
No comments:
Post a Comment