Wednesday, May 26, 2021

12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్‌ సురక్షితం : ఫైజర్‌

హైదరాబాద్ :27/05/2021

12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్‌ సురక్షితం : ఫైజర్‌

12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్‌ సురక్షితం : ఫైజర్‌

న్యూఢిల్లీ : భారత్‌లో వైరస్‌ ఉధృతికి కారణంగా చెబుతున్న వేరియంట్‌పై తమ వ్యాక్సిన్‌ అత్యంత సమర్థవంతంగా పని చేస్తుందని ఫైజర్‌ కంపెనీ తెలిపింది. B.1.617.2 వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ 87.9 శాతం సమర్థవంతంగా పని చేసిందని పేర్కొంది. యూకేలో నిర్వహించిన అధ్యయనంలో 26శాతం మంది బ్రిటీష్‌ భారతీయులు పాల్గొన్నారని, అలాగే ఆసియాకు చెందిన పౌరులపై సైతం ట్రయల్స్‌ నిర్వహించినట్లు పేర్కొంది. 12 ఏళ్లు, అంతకు మించి వయస్సున్న వారి కోసం ఇచ్చేందుకు తమ వ్యాక్సిన్‌ సిద్ధమని, భారతీయులపై జరిపిన పరిశోధనల్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది.

ఈ మేరకు భారత్‌లో అత్యవసర వినియోగానికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని ఫైజర్‌ విజ్ఞప్తి చేసింది. వ్యాక్సిన్‌ను రెండు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నెల రోజుల వరకు నిల్వ చేయవచ్చని కూడా తెలిపింది. జూలై నుంచి అక్టోబర్‌ వరకు ఐదు కోట్ల డోసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఫైజర్‌ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పరిహారంతో పాటు పలు నిబంధనలు సడలించాలని సడలించాలని కోరుతోంది. ఇప్పటికే ఈ విషయంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది.

ఈ మేరకు ఇటీవల వివిధ దేశాల్లో ఫైజర్‌ సమర్థతకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇచ్చిన ధ్రువపత్రాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇదిలా ఉండగా.. అమెరికాలోని మరో ఫార్మా దిగ్గజం మోడెర్నా ముంబైకి చెందిన సిప్లా కంపెనీతో కలిసి భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్ల తయారీని ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌కు వ్యాక్సిన్ల సరఫరాకు ముందుకు వచ్చిన ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు.. ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా టీకాలు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. నేరుగా కేంద్ర ప్రభుత్వానికి టీకాలు అమ్ముతామని స్పష్టం చేశాయి.

No comments:

Post a Comment