హైదరాబాద్ : 07/05/2021
అందరికి నమస్కారం 🙏
GHMC పరిధిలో అక్రమ కట్టడాలు జోరుగా నిర్మాణంలో వున్నాయి. వీటిని అరికట్టడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు & ప్రజాప్రతినిధులు (అన్ని రాజకీయ పార్టీల వారు) నిర్లక్ష్యం చేయడం వెనుక ఎవరికి ఎన్ని ముడుపులు చేరుతున్నాయి??. అవును ఇది అక్షరాలా సత్యం.
తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానం అక్రమ కట్టడాల విషయంలో ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా అధికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే అర్థం అవుతుంది ప్రభుత్వం యొక్క అలసత్వం. ప్రజా సంఘాల JAC ఈ అక్రమ కట్టడాల విషయంలో మళ్ళీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రాయించాలని నిర్ణయం తీసుకుంది.
ప్రజా సంకల్పం & link Media అక్రమ కట్టడాలు నిర్మాణం చేసేవారిని హెచ్చరిస్తుంది ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి. అది మీకే శ్రేయస్కరం. లేకపోతే చట్టపరమైన చర్యలు JAC ద్వారా కఠినంగా ఉంటాయి. ఇక అధికారులు అయితే న్యాయస్థానంలో ఎలాంటి సమాధానం చెపుతారో ప్రజలు చూస్తారు.
గ్రూప్ సభ్యులకు విజ్ఞప్తి అక్రమ కట్టడాలు ఎవరు నిర్మాణం చేసినా చర్యలు ఉంటాయి అది తెలుసుకొవాలి. ఎవరినీ వదిలేది లేదు.
*Copy to Group link Media*
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment