నిన్న కేసీఆర్ తెలంగాణాలో లాక్ డౌన్ అమలవుతున్న తీరు గురించి అసహనం వ్యక్తం చేసారు. మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలనీ ఆదేశాలను జారీచేశారు. దీనితో పోలీసులు అత్యుఉత్సాహం ప్రదర్శిస్తూ ప్రభుత్వం జీవోలో అనుమతిచ్చిన కార్యక్రమాలకు కూడా అడ్డుపడుతున్నారు.
నేటి ఉదయం నుండి స్విగ్గి, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ బాయ్స్ ని ఎక్కడబడితే అక్కడ ఆపుతున్నారు. వారి వాహనాలను సీజ్ చేసి చలాన్లు విధించారు పోలీసులు. నల్గొండలో ఏకంగా విద్యుత్ ఉద్యోగుల మీద లాఠీలను ఝులిపించారు. వారు ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకు వచ్చే ప్రభుత్ఉద్యోగులే కదా..? పోలీసుల ఈ స్థాయి ఓవర్ యాక్షన్ అనేక ఇబ్బందులకు కారణమవుతుంది.
హైదరాబాద్ లో ఎందరో మంది వాలంటీర్స్ ప్రభుత్వం చేయలేకపోతున్న పనులను చేస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణాలో కూడా బెడ్లు దొరకని పరిస్థితి. ఇప్పటికి కూడా కొన్ని మందుల కోసం, ఆక్సిజన్ కోసం ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ని అడుక్కోవాల్సిన పరిస్థితి. ఆసుపత్రుల్లో రెడీగా అందుబాటులో ఉండాల్సిన వస్తువులు లేవు. అలంటి పరిస్థితుల్లో ఎందరో వాలంటీర్స్ హైదరాబాద్ లో ఎందరో ప్రాణాలను కాపాడారు. ఆసుపత్రి బెడ్ల నుండి మందుల వరకు అన్నిటిని ఏర్పాటు చేసారు.
No comments:
Post a Comment