Monday, May 3, 2021

కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారో తెలుసా?

హైదరాబాద్ : 04/05/2021

కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారో తెలుసా? 

కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారో తెలుసా? 

కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది.  కరోనా విజృంభిస్తున్న సమయంలో మళ్ళీ  ఒక్కొక్క రంగం తిరిగి మూతపడుతున్నది.  దీంతో ఆయా రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు.  దేశంలో ఏప్రిల్ నెలలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  రోజువారీ మరణాల సంఖ్య భారీగా పెరిగింది.  లాక్ డౌన్ పెట్టాలనే ఒత్తిడి పెరిగింది.  అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ ను విధించారు.  మరికొన్ని చోట్ల సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  

ఇక కరోనా కేసులు, ఆంక్షలు కారణంగా దేశంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ సంస్థ పేర్కొన్నది.  మార్చి నెలలో కంటే ఏప్రిల్ నెలలోనే ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులు అధికంగా ఉన్నారని, కరోనా మహమ్మారి కేసులు పీక్స్ స్టేజికి ఎప్పుడు చేరుకుంటుందో చెప్పలేమని నిపుణులు పేర్కొన్నారు.  ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మరింతమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నది.  

No comments:

Post a Comment