ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్స్-రేలకు సమానం
అవసరం వున్నా లేకున్నా… అతిగా సీటీ స్కాన్ లు చేయించుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం లేకపోలేదని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా హెచ్చరించారు.
ఎక్కువసార్లు సీటీ స్కాన్ తీసుకోవటం వల్ల శరీరం రేడియేషన్ గురవుతుందని, అది క్యాన్సర్ కు దారితీసే అవకాశం వుందని అన్నారు. ఇటీవల కొందరు స్వల్ప అనారోగ్య లక్షణాలకే పదేపదే సీటీ స్కాన్ లు చేయించుకుంటున్నట్టు తెలుస్తోందని ఎయిమ్స్ చీఫ్ తెలిపారు. అసలు ఎలాంటి లక్షణాలు లేని కొందరిలో సీటీ స్కాన్ లో కొవిడ్ పాజిటివ్ అని వస్తోందన్నారు. స్కాన్ లో కనిపించిన చిన్న చిన్న ప్యాచెస్ సాధారణంగానే తగ్గిపోతాయని చెప్పారు. అనుమానం వస్తే ముందుగా చెస్ట్ ఎక్స్ రే తీయించుకుంటే సరిపోతుందని… సీటీ స్కాన్ 300-400 ఎక్స్ రేలకు సమానమని గులేరియా అన్నారు. ముఖ్యంగా యువతపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందని, కొవిడ్ సంబంధిత స్వల్ప లక్షణాలుంటే ఇంట్లోనే మందులతో నయమైపోతుందని డాక్టర్ గులేరియా భరోసా ఇచ్చారు
No comments:
Post a Comment