Sunday, October 23, 2022

తెలుగురాష్ట్రాల్లో.....ఖాకీ అంతర్మధనం!!

*_దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక సంచలన కథనం_*

_తెలుగురాష్ట్రాల్లో.._
*_ఖాకీ అంతర్మధనం_*

_★ఇప్పుడు సరే... మున్ముందు ఎలా?_
_★బాధితులు వ్యక్తిగతంగా చర్యలకు దిగితే మా పరిస్థితి ఏమిటి?_
_★క్షేత్రస్థాయి సిబ్బందిలో అంతర్మథనం_
_★ ఇప్పటికే పలువురు ప్రైవేటు కేసుల్లో ఇరుక్కున్నారని ఆందోళన_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

*_‘అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని, ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు‌, సమాచారహక్క ఉ పోరాట యోధులు, నిఖార్సయిన నిజాలను రాసే పాత్రికేయులపై ఇప్పుడు ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో చట్ట నిబంధనలకు విరుద్ధంగానూ వ్యవహరిస్తున్నాం. ఈ చర్యలతో ఇబ్బంది పడుతున్న బాధితులు ఇవన్నీ మనసులో పెట్టుకుని భవిష్యత్తులో మాపై వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి?’ అని తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న కొందరు అంతర్మథనం చెందుతున్నారు._*

*_ఇదో చిత్రం:_*
ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల కింద నమోదు చేసిన కేసుల్లో సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడంపై న్యాయస్థానాలు జారీ చేస్తున్న నోటీసులకు ఇప్పటికే సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోందని... ఇవన్నీ భవిష్యత్తులో తమ ఉద్యోగ సర్వీసుపై ప్రభావం చూపిస్తాయంటూ సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు తమను తీవ్రంగా హింసించారని, కొట్టారని బాధితులు న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని కోరుతున్నారు. కొన్ని సందర్బాల్లో న్యాయమూర్తి వైద్య పరీక్షలకు ఆదేశిస్తున్నారు. వీటి ఆధారంగా బాధితులు ప్రైవేటు కేసులు వేస్తే వాటి నుంచి బయటపడలేక మేం చాలా ఇబ్బందులు పడాలి. ఇప్పటికే మాలో కొందరు ప్రైవేటు కేసులు ఎదుర్కొంటున్నారు. వారు పడుతున్న బాధలేమిటో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మాకూ ఇలాంటి పరిస్థితే ఎదురైతే పట్టించుకునేవారే ఉండరు’ అని మరికొందరు సీఐడీ సిబ్బంది ప్రైవేటు సంభాషణల్లో వాపోతున్నారు.

*_కదలికలపైనా నిఘా పెడుతున్నారు:_*
‘ఉన్నతాధికారులు చెప్పినవన్నీ పాటిస్తున్నా సరే... మమ్మల్ని అనుమానాస్పదంగానే చూస్తున్నారు. మా కదలికలపైనే నిఘా పెడుతున్నారు’ అని కొంతమంది ఆవేదన చెందుతున్నారు. తెదేపా నాయకుడు చింతకాయల విజయ్‌పై నమోదు చేసిన కేసులో నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు కొందరు ఇటీవల హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. వారు చేరుకునే సరికే విజయ్‌ ఇంట్లో లేరు. దీంతో తమ విభాగంలో నుంచే ఎవరో ఒకరు ఉప్పందించడంతోనే విజయ్‌ తప్పించుకున్నారనే అనుమానంతో సీఐడీలో అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. సిబ్బంది సెల్‌ఫోన్‌ల కాల్‌డేటాను సైతం విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. సీఐడీలో ప్రత్యేక బాధ్యతల్లో ఉన్న మధ్యస్థాయి అధికారి ఒకరు ఈ కేసులు, అరెస్టుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తూ... తమను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని, ఆయన చెప్పినట్లు చేయకుంటే ఏదో రూపంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు. ఇదే సమయంలో కేసుల బాధితులు వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటే తమ పరిస్థితి దారుణంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.

*_మమ్మల్ని మార్చేయండి బాబోయ్‌:_*
పోలీసు శాఖలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది సిబ్బంది ఈ విభాగంలో తాము పనిచేయలేకపోతున్నామని, ఇక్కడి నుంచి తమను వేరే విభాగానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించుకుంటున్నారు. ఇంకొందరైతే తెలిసిన వారి ద్వారా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇటీవల ఓ ఉన్నతాధికారి తాను చెప్పినట్లు చేయలేదని సీఐడీలోని ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనస్థాపానికి గురైన బాధితుడు తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని పదేపదే కోరినా ఎవ్వరూ పట్టించుకోలేదు.

బాక్స్ 1:
*_ఏసీపీ ఆంజనేయులుపై కేసు నమోదు_*
ఖమ్మం నగర ఏసీపీ ఆంజనేయుులుపై ఒకటో పట్టణ ఠాణాలో శనివారం కేసు నమోదైంది. నగర కాంగ్రెస్‌ నాయకుడు మిక్కిలినేని నరేంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. ఇచ్చిన ఆదేశాల మేరకు ఏసీపీపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 6న కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్రను ఏసీపీ ఆంజనేయులు చొక్కా కాలర్‌ పట్టుకుని లాగుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ రౌడీషీట్‌ తెరుస్తానని బెదిరింపులకు గురి చేశారంటూ బాధితుడు మరుసటి రోజు  ఒకటో పట్టణ పోలీసులు, ఖమ్మం సీపీ, డీజీపీలకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించడంలేదంటూ నరేంద్ర ఖమ్మం జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో దాఖలైన ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన.. న్యాయస్థానం పోలీసు అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏసీపీ ఆంజనేయులుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వెనుక్కి తగ్గేదే లేదని  మిక్కిలినేని నరేంద్ర నిర్ణయం అభినందనీయం

బాక్స్ 2:
*ఇదో వింత కేసు*
మీగడ వెంకటకృష్ణ యాదవ్ పై
ఖమ్మం టూటౌన్ పోలీసుస్టేషన్ లో కేసు (427/2013) నమోదు. హైకోర్టు అరెస్ట్ చేయరాదని ఆదేశాలు. అయినా అరెస్ట్. జైలు..విడుదల. కోర్టు ధిక్కారణ నెం.1163/2013. క్వాష్ పిటిషన్ నెం. 11700/2013. ఈ కేసులతో ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఎవరినీ వదలోద్దని ఘాటైన ఆదర్శవంతమైన. వాంఛనీయ నిర్ణయం.

బాక్స్ 3:

*_ప్రపంచ రికార్డ్_*
అతనో నిఖార్సయిన పరిశోధన పాత్రికేయుడు. దేనికి లొంగడు. నీతి, నిజాయితీ ఆయనకు ప్రాణం. (ఇది తెలియకే ప్రభుత్వం బోల్తా పడింది.) అతను భూమి కొంటే .. అతనిపైనే డబ్బులు తీసుకున్నేడే కేసు పెట్టాడు. పోలీసుల అత్యుత్సాహం. భూమ్మీద ఎక్కడా లేని విధంగా రేపు నేరం చేశాడని ఈరోజే కోర్టులో ఎఫ్ఐఆర్. స్టే ఉన్నా ఛార్జిషీట్. కోర్టు ధిక్కారణ నెంబర్ 629. హైకోర్టులో పెండింగ్. ఈ కేసు గెలిస్తే.. ఏకంగా వంద కోట్లకు పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యల కోసం వెయిటింగ్. జర్నలిస్ట్ ఇప్పటికే ఈ కేస కోసం బ్యాంకులో కోటి 43 లక్షలు ఫిక్డ్ డిపాజిట్ చేయడం గమనార్హం.

No comments:

Post a Comment