*బుల్లెట్లు దూసుకెళ్లినా.... ముష్కరులను వదలని...... జాగిలం*
మాతృదేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రాణాల మీదకు వచ్చినా వెనకడుగు వేయరు సైనికులు. వారి శిక్షణలో ఓ జాగిలం కూడా అదే తరహా నిబద్ధతను కనబరిచింది.జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు నక్కినట్లు సోమవారం విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ముష్కరులను గుర్తించే పనిని అధికారులు జూమ్ అనే జాగిలానికి అప్పగించారు. దీంతో అది ఉగ్రవాదులను గుర్తించి, వారిపై దాడి చేసింది.
ఈ క్రమంలో రెండు తూటాలు శరీరంలోంచి దూసుకెళ్లినా అది పోరాటాన్ని ఆపలేదు. ఇంతలో భద్రతా దళాలు అక్కడికి చేరుకుని, ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదులను గుర్తించి, మట్టుబెట్టడంలో జూమ్‌కు కఠిన శిక్షణ ఇచ్చామని, ఇంతకుముందు కూడా చాలా ఆపరేషన్లలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించిందని అధికారులు తెలిపారు. గాయపడిన జాగిలాన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment