కేసీఆర్... కేటీఆర్ అపవిత్రం చేశారు తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేయాలి.... బండి సంజయ్*
మునుగోడు: ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర వ్యవహారం నేపథ్యంలో భాజపా, తెరాస నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో యాదాద్రి ఆలయంలో దేవుడి పాదాలు తాకడం పాపం, వెంటనే ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మునుగోడులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ''పవిత్రమైన తెలంగాణ గడ్డపై సీఎం కేసీఆర్, కేటీఆర్ మోసపూరిత వాగ్ధానాలు చేసి అపవిత్రం చేశారు. ఆ సంప్రోక్షణ కోసమే తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం. కేటీఆర్ నోరు హద్దుల్లో పెట్టుకుని మాట్లాడాలి. మీరు ఒకటి అంటే మేం వంద అంటాం. మీ ఎమ్మెల్యేలు తప్పు చేయకపోతే ప్రగతిభవన్‌లో ఎందుకు దాచిపెట్టారు. యాదాద్రి ఆలయం చాలా పవర్‌ఫుల్ టెంపుల్. తప్పు చేసిన వాళ్లు తడి దుస్తులతో గుడికి వెళ్లరు. మేం తప్పు చేయలేదు కాబట్టే తడి దుస్తులతో వెళ్లి ప్రమాణం చేశా. దేవుడి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు. 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్‌కు బానిసలయ్యారు. తప్పకుండా వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తాం. 31వ తేదీ మునుగోడు నియోజవకర్గంలోని తొమ్మిది మండలాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం'' అని బండి సంజయ్ తెలిపారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment