*ఢిల్లీలో సీయం కేసీఆర్... కాలక్షేపం*
*జాతీయ పార్టీ ప్రకటన తర్వాత*
*తొలిసారి దేశ రాజధానికి కానరాని హడావుడి..*
*కలవని ఇతర పార్టీల నాయకులు*
*పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనుల పరిశీలనతోనే సరి*
న్యూఢిల్లీ, : ''భారతదేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయడానికే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నా.. బీఆర్‌ఎ్‌సతో కలిసి ముందుకు సాగేందుకు దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముందుకువస్తున్నారు''..విజయదశమినాడు జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి! ఆ ప్రకటన తర్వాత తొలిసారి బుధవారం ఆయన ఢిల్లీకి వచ్చారు. కానీ 2 రోజులుగా ఆయన ఇక్కడ తన అధికారిక నివాసానికే పరిమితమయ్యారు!
ఈ 2 రోజుల్లో ఏ రాజకీయ పక్షానికి చెందిన నేతా ఆయన్ను కలవడానికి రాలేదు. ఢిల్లీలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించిన కేసీఆర్.. గురువారం ఆ పనులపై సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ డిజైన్ల మ్యాపును అధ్యయనం చేసి, వాస్తు ప్రకారం పలు మార్పు చేర్పులను సూచించినట్లు తెలిసింది.
అలాగే.. టీఆర్‌ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి గురువారం ఆయన్ను కలుసుకున్నారు. ఇంతకు మించి ఏ హడావుడీ కనిపించట్లేదు. ఎలాంటి రాజకీయ సందడీ లేదు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment