Friday, October 28, 2022

మంత్రి జగదీశ్ రెడ్డికీ ఈసీ నోటీసు.... వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవు

*మంత్రి జగదీశ్ రెడ్డికీ ఈసీ నోటీసు.... వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవు*

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది.ఈనెల 25న ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన ప్రసంగంపై భాజపా నేత కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక తెప్పించుకుంది. తెరాసకు ఓటుకు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ జగదీశ్‌రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని భాజపా నేత ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా జగదీశ్‌రెడ్డి చేసిన ప్రసంగం నోట్‌ను కూడా జిల్లా ఎన్నికల అధికారి పంపారు.

వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం .. ప్రాథమికంగా మంత్రి జగదీశ్‌రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు అభిప్రాయపడింది. దీనిపై రేపు సాయంత్రం 3గంటల్లోపు జగదీశ్‌రెడ్డి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. వివరణ ఇవ్వకపోతే తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment