Saturday, October 8, 2022

ఇలాంటి స్నేహితుడు శత్రువును మించిన ప్రమాదకారి.... నమ్మకం పెట్టుకుంటే... జీవితాంతం నరకమే

*ఇలాంటి స్నేహితుడు శత్రువును మించిన ప్రమాదకారి.... నమ్మకం పెట్టుకుంటే... జీవితాంతం నరకమే*

ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకమైనది. నిజమైన స్నేహితుడు తోటి స్నేహితుడి సంతోషంలో, దుఃఖంలో నీడలా ఉంటాడు. కొందరికి పరిమిత సంఖ్యలో స్నేహితులు ఉంటారు.మరికొందరికి స్నేహితులు అధికంగా ఉంటారు. అవతలి వ్యక్తిలోని గుణాలు తెలియకుండా వారితో స్నేహం చేస్తే, ఆ తరువాత పశ్చాత్తాప పడాల్సివస్తుంది. ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో స్నేహితులను ఎలా ఎంపిక చేసుకోవాలి? స్నేహితులు శత్రువులుగా ఎలా పరిణమిస్తారు? అనే విషయాలను తెలియజేశాడు. చాణక్య నీతిలోని రెండవ రెండవ అధ్యాయంలో ఆచార్య చాణక్య స్నేహం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశాడు, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ముందు మంచిగా మాట్లాడుతూ, మన వెనుక గోతులు తవ్వే స్నేహితులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు. దీనిగురించి ఆచార్య వివరంగా తెలియజేస్తూ... విషం నిండిన కుండలో కొద్దిగా పాలు పోసినా దానిని విషపు కుండ అనే అంటారు. అదే విధంగా నీ ముందు మృదువుగా మాట్లాడి, నీ వెనుక కుట్రలు పన్నే మిత్రుడు విషం నిండిన కుండలాంటివాడని ఆచార్య తెలిపారు. అందుకే అలాంటి స్నేహితులకు దూరంగా ఉండటం సరైనదని ఆచార్య చాణక్య తెలిపారు. నిజానికి ఇలాంటివారిని మిత్రుడు అని కూడా పిలువలేమని ఆచార్య పేర్కొన్నారు. అతన్ని శత్రువుగా పరిగణించడమే మంచిదని తెలిపారు. ఎవరైనాసరే స్నేహితులను త్వరగా విశ్వసించకూడదని, ఎందుకంటే మీ రహస్యాలను వారితో పంచుకుంటే ముప్పు ఏర్పడుతుందని చాణక్య హెచ్చరించారు.

మోసపూరిత మనస్తత్వం గల స్నేహితులను అస్సలు నమ్మకూడదని, అతనికి మీపై కోపం వచ్చినప్పుడు అందరి ముందు మీ రహస్యాలను వెల్లడిస్తాడని చాణక్య తెలిపారు. అలా జరిగితే మీరు పశ్చాత్తాపపడవలసి వస్తుందని ఆచార్య తెలిపారు. అదేవిధంగా కొందరు స్నేహితులు మీ రహస్యాలను తెలుసుకుని, బెదిరింపులకు పాల్పడి మిమ్మల్ని తప్పుడు పనులు చేయాలని బలవంతపెట్టే అవకాశాలుంటాయి. అందుకే మీరు ఎవరినైనా మంచి స్నేహితునిగా భావించినా వారికి మీ రహస్యాలను ఎప్పుడూ చెప్పకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. వ్యక్తిగత విషయాలకు దాపరికం అవసరమని ఆచార్య చాణక్య సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment