Saturday, October 29, 2022

ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదు.....?

*ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదు.....?*

    *రేవంత్ రెడ్డి*
హైదరాబాద్: తెరాస, భాజపా.. సమన్వయంతో పనిచేసుకుంటూ మునుగోడు ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ లేనట్టుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.ఆ రెండు పార్టీలూ వ్యూహాత్మకంగానే వివాదాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. మునుగోడు మండలం కొంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

''మునుగోడు ఉపఎన్నిక, జోడో యాత్రల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే భాజపా, తెరాస నాటకాలు ఆడుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం వ్యవహారంలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లను ఎందుకు సీజ్ చేయలేదు? ఏసీబీ పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోంది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలోనే ఈ తతంగమంతా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. అలాగైతే ఈ కేసులో కేసీఆర్‌ను ఏ1గా, కేటీఆర్‌ను ఏ2గా చేర్చాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలను కూడా నిందితులుగా చేర్చాలి. దర్యాప్తు సంస్థలపై మాకు నమ్మకం లేదు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణ చేయించాలి'' అని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment