*_కళ్యాణ్.. ఏమిటి పొగరు.!_*
_★ 'హంట్' వివాదం_
_★ తల తిక్క పనులు ఏల.? ★ మీరు మారరా.?_
_★ సినీ పెద్దలు ఏం చేస్తున్నారు.?_
*_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు,. 9440000009, 'తెలంగాణ వాత్' ప్రత్యేకం)_*
*_చిన్న సినిమా అంటే చిన్న చూపే. పైకి మాత్రం ఎన్నో తీపి కబుర్లు. ఔత్సాహిక యువత ఓ సినిమా తీద్దాం అనుకుంది. నిబంధనల మేరకు టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది. ఇంతలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తి.. మనకు ముసుగులో గుద్దులాట ఎందుకు.. ప్రిన్స్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఏకంగా అదే పేరుతో ఓ పోస్టర్ విడుదల చేశాడు. దానికి కళ్యాణ్ ఆధ్వర్యంలోని నిర్మాత మండలి వంత పాడటం. నిబంధన మేరకు.. నిస్సంకోచంగా.. నిస్సందేహంగా టైటిల్ హిరో కం డైరెక్టర్ నిక్షిత్ దే.. అందులో ఎలాంటి సందేహం లేదు. నిర్మాత కళ్యాణ్ ఎందుకు ఈ టైటిల్ విషయంలో ఇంత మూర్ఖంగా ముందుకు వెళ్ళాడు.? ఇప్పటికైనా ఈ విషయంలో ఆయన నిజాయితీగా ఉంటాడా..? ఉండడా..? కాలం తేలుస్తుంది. మా లెక్కలు మాకు తప్పకుండా ఉంటాయ్.._*
*_అసలేం జరిగిందంటే..?_*
జులై నెలలో శ్రీ క్రియేషన్స్ బ్యానర్ 'హంట్' అనే టైటిల్ ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో అన్ని ఫీజులు చెల్లించి నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేసుకుంది.
*_వివాదం ఎక్కడ మొదలు.?_*
సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ ‘హంట్’ పేరుతో ఓ సినిమా తీస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేశారు. అనంతరం టీజర్, పాటలను కూడా బయటకు వదిలారు.
*_రిజెక్ట్ చేశాయి.._*
భవ్య క్రియేషన్స్ 'హంట్' టైటిల్ కోసం దరఖాస్తు చేసింది. తెలుగు, తెలంగాణ రెండు ఫిల్మ్ ఛాంబర్స్ ఆ ప్రతిపాదనను రిజెక్ట్ చేశాయి, మరి అలాంటప్పుడు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏ అధికారంతో ఈ వ్యవహారంలోకి వచ్చింది. కళ్యాణ్ అత్యుత్సాహం ఎందుకు చూపుతున్నారు.?
*_ఎంటర్ అయిన 'తొండి బ్యాచ్'_*
ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు ఉన్న అధికారాలు ఏమిటి.? దానికి టైటిల్స్ ఇచ్చే హక్కు ఉందా.? అంటే లేదు. ఉండదు. అయినా అదే 'హంట్' టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా భవ్య క్రియేషన్స్ వారికి రిజిస్ట్రేషన్ చేసింది. టైటిల్స్ ఇచ్చే అధికారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కు మాత్రమే ఉంటుంది. మరి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎందుకు ఈ వివాదంలోకి వచ్చింది.
*_లీగల్ నోటీసులు పంపారు_*
"హాంట్' సినిమా టైటిల్ పై శ్రీ క్రియేషన్స్ బ్యానర్ తరుపున లాయర్ సురేష్ బాబు
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా డైరెక్టర్, హీరో నిక్షిత్, అడ్వకేట్ సురేష్ బాబు, నిర్మాత నర్సింగ రావ్, ఎం.ఎస్.ఆర్ట్స్ స్టూడియో తరుపున తల్లాడ సాయికృష్ణలు మాట్లాడుతూ 'ఇండస్ట్రీలో జరుగుతున్న రాజకీయ అన్యాయాన్ని తెలుసుకున్నాం, మాకు సపోర్ట్ గా ఇప్పడు రెండు తెలుగు ఫిల్మ్ ఛాoబర్లు తోడుగా నిలబడ్డాయి, ఫిల్మ్ ఛాoబర్స్ సైతం ఈ టైటిల్ శ్రీ క్రియేషన్స్ వారి పేరు మీద ఉంది, అలాంటిది ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఇవ్వొద్దు అని లెటర్స్ పెట్టిన వారి మాటని తిరస్కరించి అనుమతి ఇచ్చిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తప్పును వారే తెలుసుకోవాలి, ఎవరికి అన్యాయం జరగవద్దు' అని అన్నారు.
బాక్స్:
*_ఇదేం పని బాసూ.._*
౼ భూ వివాదంలో ఇరుక్కున్న నిర్మాత సి కళ్యాణ్..
౼ పోలీసు కేసు నమోదు
తెలుగు ఇండస్ట్రీలో సినిమాలతోనే కాకుండా వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉండే నిర్మాత సి కళ్యాణ్. తాజాగా ఈ నిర్మాతతో మరో ముగ్గురిపై షేక్ పేట భూవివాదంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
తెలుగు ఇండస్ట్రీలో సినిమాలతోనే కాకుండా వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉండే నిర్మాత సి కళ్యాణ్. సీనియర్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన ఈయన.. చిన్న హీరోలతోనూ వరస సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఈ మధ్య కాస్త నెమ్మదించిన ఈ నిర్మాతపై ఇప్పుడు పోలీసు కేసు నమోదైంది. షేక్ పేట భూవివాదంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి కళ్యాణ్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. ఉన్నట్లుండి ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఇప్పుడు పోలీసు కేసు వరకు వచ్చింది. అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న స్వరూప్.. 1985లో షేక్‌పేటలో ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. ఆరేళ్ళ కింద అంటే 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి ఆ భూమిని లీజుకు ఇచ్చాడు. నారాయణమూర్తి ఆ స్థలంలో ప్రస్తుతం ఓ ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్నాడు. అయితే జూన్ 28 సాయంత్రం నిర్మాత సి కళ్యాణ్ పంపిస్తే వచ్చామని.. షరూఫ్, శ్రీకాంత్, తేజస్వి కలిసి ఆర్గానిక్ స్టోర్‌కు తాళం వేశారు. స్వరూప్ సోదరుడు ఫిర్యాదు చేయడంతో వీళ్ళ ముగ్గురితో పాటు నిర్మాత సి కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
No comments:
Post a Comment