Friday, October 28, 2022

మన ఊరు-మన బడి'లో స్కాముల పాఠాలు_

*_రూ.600 కోట్లకు టెండర్.!_*

_◆ అప్పుడు.. ఇప్పుడు.. ఒకే తంతు..!_
_◆ 'మన ఊరు-మన బడి'లో స్కాముల పాఠాలు_
_◆ స్మార్ట్ క్లాస్ రూమ్స్ సిస్టమ్స్ కోసం బిడ్డింగ్_
_◆ సెల్ కాన్ కంపెనీకి దక్కేలా పక్కా ప్లాన్..!_
_◆ అన్నీ తానై నడిపిస్తున్న ఆ మంత్రి.?_
_◆ 'తొలివెలుగు' ప్రయత్నం అభినందనీయం_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944 00 00 009, 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_'వడ్డించేవాడు మనోడైతే.. విందులో ఎక్కడ కూర్చుంటే ఏమిటి.?' అనే సామెతకు ఈ రూ.600 కోట్ల టెండర్ వ్యవహారం సరిగ్గా సరిపోతుంది. తెలంగాణలో ఓపెన్ బిడ్డింగ్ టెండర్ ఏదైనా.. భలేగా అనుకున్న వారికే వస్తుంది. అందుకు ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడరనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 'మన ఊరు-మన బడి' టెండర్ల స్కాంని గతంలో 'తొలివెలుగు' దర్జాగా బయటపెట్టింది. హైకోర్టులో విచారణకు రాగానే మొత్తం టెండర్లు రద్దు చేసుకుంటున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు._*

*_మీం ఇంతే చేస్తాం.._*
మేఘా కృష్ణారెడ్డికి దోచిపెట్టే ప్రయత్నాన్ని ఆనాడు ఎండగట్టి ప్రజల ముందు ఉంచింది తొలివెలుగు. ఇక అడ్వటైజింగ్ స్కాంలోనూ ఇదే తంతు కొనసాగింది. ఆంధ్రాకు చెందిన కంపెనీలకు అన్నీ అడ్డంగా కట్టబెట్టారు. వందల కోట్లు చేతులు మారాయి. కేసీఆర్ 'ప్రొటీన్ కిట్స్' విషయంలోనూ అంతే. ముందే నిర్ణయించుకున్న కంపెనీకి 'బ్యాక్ డోర్' ద్వారా లబ్ది పొందే పనులు అప్పగించారు. 'టెక్నికల్ గ్రౌండ్స్' అంటూ మెలికలు పెట్టి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు చోటు ఇవ్వ లేదు. పెద్ద కంపెనీలను 'లోకల్ వర్క్స్' అంటూ తప్పించుకుని రానివ్వడం లేదు. ఎన్ని జిమ్మిక్కులు చేసైనా.. అనుకున్న వారికి ఇవ్వడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా...డిజిటల్ క్లాస్ రూంల కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూం టెండర్స్ లోనూ అదే ప్లాన్ ను అమలు పరిచారు.

*_'సెల్ కాన్' కోసం బరితెగింపు..!_*
స్మార్ట్ క్లాస్ రూమ్స్ కోసం కంపూటర్స్ సప్లై, ఇన్ స్టాలేషన్ అండ్ కమిషనింగ్ కోసం ఈ నెల 20న ఓపెన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ లు పిలిచారు. 27న ప్రీ బిడ్డింగ్ ఏర్పాటు చేశారు. క్లోజింగ్ డేట్ వచ్చే నెల 10 వరకు ఉంది. మూడేళ్ళు ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుంది. 4,660 పాఠశాలల్లో 8, 9, 10 తరగతి గదులలో అన్నీ బిగించాలి. యూపీఎస్ నుంచి ల్యాన్ కేబులింగ్ చేయాలి. ఇందుకు టెక్నికల్ గా పెద్ద మొత్తంలో పని చేయాలని ప్లాన్ చేశారు.

*_పక్కా ప్లానింగ్_*
ఈ ఒక్క కంపెనీకి మాత్రమే సరితూగే విధంగా టెండర్లు తయారు చేశారని కాంట్రాక్టర్స్ ఆరోపిస్తున్నారు. సెల్ కాన్ కంపెనీకి 600 కోట్ల ప్రాజెక్ట్ అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తూతూ మంత్రంగానే ప్రీ బిడ్డింగ్ మీటింగ్ జరిగిందని.. కాంట్రాక్టర్స్ వారి అనుమానాలను వ్యక్తపరిచినా ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ పట్టించుకోనట్లే వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

*_మళ్లీ కోర్టు గుమ్మంలోకి.._*
మన ఊరు-మన బడి, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ టెండర్స్ విషయంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇప్పుడు 'మన ఊరు-మన బడి'లో భాగమైన డిజిటల్ క్లాస్ రూమ్స్ నిర్వహణ ఒక్క కంపెనీకే ఇచ్చే కుట్ర చూస్తుంటే మళ్లీ న్యాయస్థానం వైపే అడుగులు వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

*_అన్నీ తానై నడిపిస్తున్న ఆ మంత్రి.?_*
ఈ మొత్తం వ్యవహారంలో ఓ మంత్రి హస్తం ఉందని గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మరెన్నో సంగతులు 'తొలి వెలుగు'లో చూడనున్నాయి. అప్పుడు మెయిన్ మీడియా ఈ విషయంపై గుండెలు బాదుకుంటూ అరుస్తుంది.

No comments:

Post a Comment