Friday, October 28, 2022

అధికారులు వివరణ ఇవ్వాల్సిందే

అధికారులు వివరణ ఇవ్వాల్సిందే


అధికారులు వివరణ ఇవ్వాల్సిందే
  • సిఫారసులపై చర్యలు చేపట్టాలి
  • కేసులపై మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి సమీక్ష
హైదరాబాద్‌, అక్టోబర్‌28(నమస్తే తెలంగాణ): తాము చేసే సిఫారసులపై ప్రభుత్వ శాఖలు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాకిటి సునీతా లక్ష్మిరెడ్డి కోరారు. ఆయా సిఫారసులపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారో వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మహిళా కమిషన్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె కమిషన్‌ పరిధిలోకి వచ్చే కేసులపై సమీక్షించారు. ఆస్తుల వివాదాలు, కోర్టు కేసులపై మహిళలు సంబంధిత శాఖలను ఆశ్రయించాలని, అవి కమిషన్‌ పరిధిలోకి రావని సునీతారెడ్డి చెప్పారు. లైంగిక దాడికి గురైన బాధిత మహిళలకు రావాల్సిన పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని అధికారులను కోరారు. మహిళలు తమకు జరిగే అన్యాయంపై కమిషన్‌ దృష్టికి తేవాలని సూచించారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ @SCWTelangana లేదా telangana statewomenscommission@gmail.com, హెల్ప్‌లైన్‌ 181, వాట్సాప్‌ నంబర్‌ 9490555533కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. సమావేశంలో కమిషన్‌ సభ్యులు షహీన్‌ అప్రోజ్‌, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, రేవతీరావు, కార్యదర్శి కృష్ణకుమారి పాల్గొన్నారు.

Courtesy by : నమస్తే తెలంగాణ మీడియా 

No comments:

Post a Comment