Friday, October 21, 2022

బీజేపీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై

బీజేపీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై

బీజేపీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై

మునుగోడు ఉప ఎన్నికల వేళ..బీజేపీకి షాక్ తగిలింది. పార్టీ లీడర్ దాసోజు శ్రవణ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు దాసోజు శ్రవణ్ లేఖ రాశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు.  రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించే బదులు మందు, మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం ద్వారా మునుగోడు ఉప ఎన్నికల్లో  గెలవాలనుకుంటున్న బీజేపీ తీరు పట్ల  నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బీజేపీకి గుడ్ చెప్పిన దాసోజు శ్రవణ్.. టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 2.30గంటలకు మన్నెగూడలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 

దశాదిశాలేని నాయకత్వ ధోరణులు
బీజేపీలో ప్రస్తుతం అనిశ్చితి నెలకొందని, దశాదిశా లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాసిన లేఖలో దాసోజు శ్రవణ్ ప్రస్తావించారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని చెప్పిన మీరు, మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది.. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలాలే, పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లుగా కొనసాగిస్తున్న వైఖరి నాలాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండదని తేటతెల్లమైందని శ్రవణ్ లేఖలో పేర్కొన్నారు. అనేక ఆశలతో ఆశయాలతో నేను బిజేపీలో చేరినప్పటికీ దశాదిశాలేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మక రాజకీయాలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలో అర్థమైంది...ప్రజాహితమైన పథకాలతో, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కన్నా మందు మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం తద్వారా మునుగోడు ఎన్నికలలో గెలుపు సాధించాలనుకుంటున్న మీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను...అని దాసోజు శ్రవణ్ లేఖలో ప్రస్తావించారు. 

ఆగస్టులో కాంగ్రెస్ కు రాజీనామా...
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా పేరున్న దాసోజు శ్రవణ్ ...ఆగస్టు 5న ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆగస్టు 7న కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్.. అప్పట్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి 91 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో చేరారు. కొద్ది కాలంలోనే కేసీఆర్, కేటీఆర్ కు సన్నిహితుడిగా మారారు. అయితే టీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ ను ఆశించిన శ్రవణ్.. టికెట్ దక్కకపోవడంతో మనస్థాపానికి గురై పార్టీని వీడారు. టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన శ్రవణ్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. పార్టీ హై కమాండ్ ఆయనను ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమించింది. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని సైతం కల్పించింది. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇటీవలే  ఖైరతాబాద్కు చెందిన మాజీ మంత్రి దివంగత పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో దాసోజు కాంగ్రెస్ పార్టీని వీడి ఆగస్టులో బీజేపీలో చేరారు

Courtesy by : V6 వెలుగు మీడియా 

No comments:

Post a Comment