Monday, October 31, 2022

తెరాసతో పొత్తు ప్రసక్తేలేదు.....రాహుల్ గాంధీ...!

తెరాసతో పొత్తు ప్రసక్తేలేదు.....రాహుల్ గాంధీ...!*

తిమ్మాపూర్‌: తెరాసతో ఎలాంటి అవగాహన లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రస్తక్తే లేదని..ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. 'భారత్‌ జోడో యాత్ర'లో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. తెరాసతో పొత్తు ఉండొద్దన్నది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయమని.. దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

''వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలు విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా ఉండబోతున్నాయి. భాజపా, తెరాస ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయి. ఉప ఎన్నికకు రూ.వందలకోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? భాజపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి తీరుతుంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో పోరాటంపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం తీసుకుంటారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నాయి. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటా. భారత్‌ జోడో యాత్రతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నాం. యాత్ర పొడవునా అందరూ చెప్పే మాటలు వింటా'' అని రాహుల్‌ అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment