Friday, October 23, 2026

రేవంత్ రెడ్డి -కాంగ్రెస్ అసమర్థ పాలనపై అసెంబ్లీలో తక్షణమే సమగ్ర శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలి!_

*తెలంగాణ రైజింగ్ కాదు.. అప్పుల ఊబిలో సింకింగ్!*

*రేవంత్ రెడ్డి -కాంగ్రెస్ అసమర్థ పాలనపై అసెంబ్లీలో తక్షణమే సమగ్ర శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలి!*

*డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 23:

కేవలం 6 నెలల్లోనే (ఏప్రిల్–సెప్టెంబర్ 2026) రేవంత్ రెడ్డి సర్కార్ మార్క్ ఆర్థిక వినాశనం బట్టబయలైంది అని డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అన్నారు.

**కాగ్ (CAG) అధికారిక నివేదిక ప్రకారం:**

*(1)*: బడ్జెట్ అంతా పచ్చి దగా:
రూ. 6,857 కోట్ల "మిగులు" అని అసెంబ్లీలో గొప్పలు చెప్పి, 180 రోజుల్లోనే రాష్ట్రాన్ని ఏకంగా రూ. 15,096 కోట్ల భారీ రెవెన్యూ లోటు మైనస్ 220.13శాతం లోకి నెట్టేశారు! 

*(2)*: నెలకు సగటున రూ. 2,516 కోట్ల చొప్పున ఖజానా రక్తం ఓడుతోంది. ప్రాథమిక లోటు రూ. 28,046 కోట్లకు 75.49శాతం కు చేరింది.

*(3)*: అప్పుల రారాజు రేవంత్:ఏడాది మొత్తం చేయాల్సిన అప్పుల పరిమితి రూ. 58,458 కోట్లు అయితే, 6 నెలల్లోనే  76.31శాతం,రూ. 44,612 కోట్లు గుటుక్కున మింగేశారు! 

*(4)*: రాబోయే 6 నెలలకు మిగిలింది కేవలం 23.69శాతం కోటా మాత్రమే. నవంబర్ నాటికే ఆర్థిక స్తంభన Liquidity Freeze ఖాయంగా కనిపిస్తోంది.

**పెన్షన్ల బడ్జెట్ 96.6% ఆవిరి:**

వార్షిక పెన్షన్ బడ్జెట్ రూ. 14,736 కోట్లలో సెప్టెంబర్ నాటికే రూ. 14,235 కోట్లు 96.60శాతం  స్వాహా చేశారు! 
మిగిలిన 6 నెలలకు కేవలం రూ. 501 కోట్లు 3.4శాతం మాత్రమే మిగిలితే, రిటైర్డ్ ఉద్యోగులకు, పింఛనుదారులకు పెన్షన్లు ఎలా ఇస్తారు? ఆస్తుల కల్పన శూన్యం - కేపిటల్ వ్యయం పక్షవాతం: సాధారణ రంగంలో ఆస్తుల సృష్టి కేవలం 18.44%, పాఠశాలలు-ఆసుపత్రుల సామాజిక మౌలిక వసతుల వ్యయం కేవలం 29.91% మాత్రమే! మొత్తం ఖర్చులో 80% రోజువారీ నిర్వహణకే తగలబెడుతూ అభివృద్ధిని పూర్తిగా పడకేశారు. 'యంగ్ ఇండియా స్కూల్స్' అన్నీ గాలి మాటలే అయ్యాయి అని తెలిపారు.

**రాబడి పాతాళానికి:**
 
*నాన్-టాక్స్ రెవెన్యూ 16.10శాతం, 
*ఢిల్లీ దౌత్యం ఘోర వైఫల్యంతో కేంద్ర గ్రాంట్లు 15.34శాతం, 
*ఎక్సైజ్ రాబడి 37.84శాతం వద్దే చచ్చాయి. 

అన్నింటికంటే ఘోరం.. రాజ్యాంగబద్ధ ఆడిట్ సంస్థ అయిన 'కాగ్' (CAG)కే ప్రభుత్వ గ్యారెంటీలు, పబ్లిక్ అకౌంట్ అప్పుల లెక్కలు ఇవ్వకుండా దాచిపెట్టారు!నాయకత్వానికి కావలసింది ప్రజలకు ఉపయోగపడే పదునైన ఆలోచనలు, అంతేకాని పసలేని రాజకీయ ఆరోపణలు కావు. 
కొత్త ఆదాయ మార్గాలను వెతకకుండా ఉన్న ఆస్తులను కరిగిస్తూ పోవడం వల్ల తెలంగాణ భవిష్యత్తుకు తీరని నష్టం జరుగుతోంది.

No comments:

Post a Comment