Tuesday, October 20, 2026

ఈ పండుగ పూట మూగజీవాలకు స్వేచ్ఛను ప్రసాదిద్దాం. బంధించిన పక్షుల ప్రదర్శనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించకండి_

పండుగ అంటేనే ఆనందం, స్వేచ్ఛ, తోటి ప్రాణుల పట్ల కరుణ చూపించడం. కానీ, దసరా వేళ శుభం అంటూ కొందరు తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రెక్కలు కత్తిరించి, బోనుల్లో బంధించి వ్యాపారం చేస్తున్నారు. 

ఆలోచించండి... 
ఒక మూగజీవి స్వేచ్ఛను హరించి, దానికి ఆహారం, నీరు లేకుండా హింసిస్తూ చూస్తే ఎవరికైనా మేలు ఎలా జరుగుతుంది? ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది? 

పాలపిట్ట మన పర్యావరణానికి రక్షకుడు, రైతుకు మేలు చేసే నిజమైన నేస్తం. అది నీలాకాశంలో స్వేచ్ఛగా రెక్కలు విప్పి ఎగురుతున్నప్పుడే ప్రకృతికి అందం, మన సమాజానికి గౌరవం.

వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం పాలపిట్టలను బంధించడం, విక్రయించడం, ప్రదర్శించడం నేరం. 

ఈ పండుగ పూట మూగజీవాలకు స్వేచ్ఛను ప్రసాదిద్దాం. బంధించిన పక్షుల ప్రదర్శనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించకండి. 

ఎక్కడైనా పాలపిట్టలను బంధించినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే  టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించండి.

#SavePalapitta #IndianRoller #CrueltyFreeDussehra #EcoFriendlyDussehra #TelanganaForest #WildlifeConservation

No comments:

Post a Comment