Monday, October 12, 2026

ప్రొఫెసర్ హరగోపాల్ హిందూ మహిళపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము_

*ప్రొఫెసర్ హరగోపాల్ హిందూ మహిళపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము*

*శ్రీమతి రావు పద్మారెడ్డి - బీజేపీ నాయకురాలు, వరంగల్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 11:

కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ హిందూ మహిళపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అని శ్రీమతి రావు పద్మారెడ్డి అన్నారు.ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది అని తెలిపారు.ఈ వ్యవహారంపై తగిన విచారణ జరిపించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది అని అన్నారు.ఆర్ఎస్ఎస్ కానీ ఏ ఇతర హిందూ గ్రంధాలలో లేని మాటను చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి ప్రచారం చేయడం మానవ హక్కుల మేధావిగా ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.ప్రొఫెసర్ హరగోపాల్ యావత్ హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి!.హిందూ మహిళల ఆత్మగౌరవం, హిందూ ధర్మ విశ్వాసాల పట్ల గౌరవం ప్రతి ఒక్కరి బాధ్యత. మహిళల గౌరవాన్ని, సమాజ విశ్వాసాలను కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేము.
ఈ అంశంపై మహిళా కమిషన్ తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అని రావు పద్మారెడ్డి అన్నారు.మహిళల గౌరవం కోసం… హిందూ సమాజ ఆత్మగౌరవం కోసం మా గొంతు నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది అని అన్నారు.

No comments:

Post a Comment