*పోలీస్ పతాక దినోత్సవం 2026 సందర్బంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు - తెలంగాణ రాష్ట్ర పోలీస్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 17:
ప్రియమైన విద్యార్థులారా,విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన పోలీస్ సిబ్బంది స్మరణార్థం, అక్టోబర్ 21వ తేదీని “పోలీస్ పతాక దినోత్సవం”గా పాటిస్తారు. ఈ సందర్భంగా, పోలీస్ సిబ్బంది త్యాగాలను గౌరవించడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించడం, మరియు పోలీసులకు, ప్రజలకు మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ వివిధ పోటీలను నిర్వహిస్తోంది.
**కింది పోటీలలో పాల్గొనవలసిందిగా విద్యార్థులకు ఆహ్వానం**
*(1)*: విద్యార్థుల కోసం ఆన్‌లైన్ వ్యాస రచన పోటీ
*(2)*: అర్హులైన అభ్యర్థులు: 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు ఆపైన
*(3)*: భాషలు: ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ
*విధానం: ఆన్‌లైన్*
**చివరి తేదీ: 28-10-2026**
**వ్యాస నిడివి: 500 పదాలకు మించకూడదు**
**కేటగిరీ 1: ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు**
క్రింది అంశాల్లో ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకోండి:
సైబర్ నేరాల నివారణలో పౌరులు మరియు పోలీసుల పాత్ర.
డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్‌కు ఎలా దూరంగా ఉండగలరు?
*కేటగిరీ 2: డిగ్రీ మరియు అంతకంటే పై స్థాయి**
ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకోండి:
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర.
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర.
పోటీలో పాల్గొనాలి అంటే నమోదు చేయాల్సిన లింక్: forms.gle/YkeKUscWu5LFYW…
మీ పేరు, విద్యా వివరాలు మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.మీకు నచ్చిన భాషలో, కాగితంపై మీ వ్యాసాన్ని రాయండి.ఆ వ్యాసాన్ని చిత్రం (image) లేదా PDF ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసి, ఆన్‌లైన్‌లో సమర్పించండి.
**బహుమతులు మరియు గుర్తింపు**
విద్యార్థుల కోసం నిర్వహించే ఈ వ్యాస రచన పోటీలో, ప్రతి జిల్లా నుండి, మూడు భాషలలో విజేతలకు మొదటి, రెండవ మరియు మూడవ బహుమతులు అందజేయబడతాయి. స్థానిక ప్రముఖ నాయకులు మరియు విశిష్ట వ్యక్తులు పాల్గొనే కార్యక్రమాలలో ఈ బహుమతులు మరియు జ్ఞాపికలను అందజేస్తారు.విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.
No comments:
Post a Comment