*జలమండలి పేరుతో ప్రచారంలో ఉన్న సందేశం అవాస్తవం*
*నవంబర్ చివరికి రిజర్వాయర్లు ఎండిపోతాయన్న వాదనకు అధికారిక ఆధారం లేదు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 13:
ఎల్నినో ప్రభావం, రాబోయే కరవు కారణంగా నవంబర్ చివరి నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయని, హైదరాబాద్లో నీటి సరఫరా పరిమితం అవుతుందని లేదా నిలిచిపోతుందని పేర్కొంటూ వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న సందేశాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) జారీ చేయలేదు.
రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆ సందేశంలో పేర్కొన్న సమాచారం అధికారికం కాదు. జలమండలి పేరుతో వచ్చే నిర్ధారణలేని సందేశాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నీటి సరఫరా, పొదుపుపై సూచనలు జలమండలి అధికారిక ప్రకటనలు, సమాచార మార్గాల ద్వారానే తెలుసుకోవాలి.నీటిని బాధ్యతగా వినియోగించి పొదుపు చేయాలని జలమండలి ప్రజలను కోరుతోంది.
No comments:
Post a Comment