Friday, October 16, 2026

ఫతేనగర్, బాలానగర్ ప్రాంతాల ముంపు సమస్య పరిష్కారానికి అడుగులు_

*కూకట్పల్లి నాలా విస్తరణకు హైడ్రా చర్యలు*

*ఫతేనగర్, బాలానగర్ ప్రాంతాల ముంపు సమస్య పరిష్కారానికి అడుగులు*

*పూడికతీతతో పాటు ఆక్రమణల తొలగింపు*

*సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ సమీక్ష*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 15:

ఫతేనగర్‌ – బాలానగర్‌ పారిశ్రామిక, నివాస ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా పరిష్కరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటికీ కూకట్పల్లి నాలాలో పూడికతీత పనులను ముమ్మరంగా చేపట్టిన హైడ్రా.. ఆక్రమణలు తొలగించడంపై దృష్టి పెట్టింది. పెదవాళ్ళ నివాసాల జోలికి వెళ్లకుండా ఈ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు గురువారం సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  హైడ్రా కార్యలంలో సమీక్షించారు.
సీ‌ఎంసీ, ఎంఎంసీ, పారిశ్రామికవాడ కోఆపరేటివ్‌ సొసైటీ ప్రతినిధులు, ఐలా (ILA) అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు.
ఫతేనగర్‌–బాలానగర్‌ పారిశ్రామిక ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా నివారించాలంటే నాలాల్లో పూడికతీతతో పాటు, ఆక్రమణలను తొలగించి నాలాను విస్తరించడం అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు. చెరువుల నుంచి వచ్చే వరద నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా నాలాల ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ అధికారులకు సూచించారు. నల పొడుగునా పారిశ్రామికవాడ లేఅవుట్ ను పరిశీలిస్తే ఆక్రమణలు ఎంతమేర జరిగాయనేది స్పష్టం అవుతుందన్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా విస్తరణ మాదిరి ఇక్కడ కూడా పనులు జరగాలన్నారు. ప్యాట్నీ నాల విస్తరణతో ఎగువున ఉన్న వేల కుటుంబాలకు, పదులసంఖ్యలో ఉన్న బస్తీలకు వరద ముప్పు తప్పించామని గుర్తు చేశారు.

**భారీమోత్తంలో వరద సాఫీగా సాగేలా*

పరికిచెరువు, ఐడీఎల్‌ చెరువుల నుంచి వచ్చే వరద నీరు కూకట్‌పల్లి నాలా ద్వారా ప్రవహిస్తుండగా, ఫాక్స్‌ సాగర్‌ నుంచి జీడిమెట్ల మీదుగా వచ్చే వరద కాలువ గౌతంనగర్‌ పరిసరాల్లో ఈ నాలాలో కలుస్తుంది. యిలా హుస్సేన్‌సాగర్‌లో కలిసే వరకు నల విస్తరణ చేపట్టాల్సి ఉంది. 

**40 మీటర్ల వెడల్పు నాలా 9 మీటర్లకు చేరింది*

ఫతేనగర్‌ ప్రాంతంలో సుమారు 40 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణల కారణంగా కేవలం 9 మీటర్లకు కుంచించుకుపోయిందని అధికారులు కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఫతేనగర్‌–బాలానగర్‌ పారిశ్రామిక ప్రాంతాల్లోని నాలా మొత్తం సుమారు 4.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, ఇందులో 2.2 కిలోమీటర్ల పరిధి సీ‌ఎంసీ పరిధిలోకి, మరో 2 కిలోమీటర్లు ఎంఎంసీ పరిధిలోకి వస్తాయని అధికారులు తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నాలా హద్దులను గుర్తించాలని, ఆక్రమణల తొలగింపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ సూచించారు.

 **పారిశ్రామికవాడకు 47 ఎకరాల భూ కేటాయింపు.**

పారిశ్రామికవాడ కోఆపరేటివ్‌ సొసైటీకి 1963లో 30 ఎకరాలు, 1964లో 17 ఎకరాలు కేటాయించినట్లు సమావేశంలో అక్కడి పారిశ్రామిక ప్రతిందులు ప్రస్తావించారు. నాలా హద్దులు, పారిశ్రామిక ప్రాంతంలోని నిర్మాణాలు, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.కేవలం 30 నిమిషాల పాటు వర్షం కురిసినా పారిశ్రామిక యూనిట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పారిశ్రామికవేత్తలు తెలిపారు. నాలా ఆక్రమణల తొలగింపు, విస్తరణ పనులకు తాము పూర్తి సహకారం అందిస్తామని పారిశ్రామికవాడ కోఆపరేటివ్‌ సొసైటీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హామీ ఇచ్చారు. తొలుత తరచూ వరద ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో నాలా విస్తరణకు ప్రాధాన్యం ఇస్తూ, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హైడ్రా కమిష ఈ ఏవీ రంగనాథ్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

No comments:

Post a Comment