Sunday, October 11, 2026

తెలంగాణ వైద్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి_

*తెలంగాణ వైద్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి*

*ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 10:

మెడికవర్ ఆసుపత్రి వరుస మరణాలపై సమగ్ర విచారణ జరపాలి. వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బాధ్యత వహించాలి, వెంటనే రాజీనామా చేయాలి అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు అన్నారు.సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 21, 22 తేదీల్లో తక్కువ వ్యవధిలో పలువురు రోగులు మృతి చెందినట్లు వెలువడిన వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు అన్నారు. ఇంత తీవ్రమైన ఘటనకు సంబంధించిన సమాచారం ఆలస్యంగా ప్రజల ముందుకు రావడం మరింత ఆందోళనకరమన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఇలాంటి ఘటనలను ప్రభుత్వం ఎందుకు ముందుగానే గుర్తించలేదు? సంబంధిత అధికారులు ఏ చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులపై వరుసగా వస్తున్న ఫిర్యాదులు, అధిక బిల్లులు, వైద్య సేవల్లో లోపాల ఆరోపణలు, రోగుల భద్రతకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తగిన నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని ఆప్ తెలంగాణ కన్వీనర్ మిస్ హేమా అన్నారు. వైద్య ఆరోగ్య శాఖను పర్యవేక్షించే మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ ఘటనపై నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు. విజయశాంతి గతంలో ప్రశ్నించినా పరిస్థితి ఎందుకు మారలేదు? ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అధిక వసూళ్లు, ప్రజలపై పడుతున్న వైద్య ఖర్చుల భారంపై విజయశాంతి గతంలో కూడా బహిరంగంగా ప్రశ్నలు లేవనెత్తారు. అయినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు, ఆరోపణలు కొనసాగుతుండటం ఆందోళనకరమన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపై సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థను ఎందుకు అమలు చేయడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. SITతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు డిమాండ్. 

**మెడికవర్ ఆసుపత్రిలో జరిగినట్లు వార్తల్లో వచ్చిన మరణాలపై:**

*(1)*: ప్రత్యేక వైద్య నిపుణుల కమిటీతో విచారణ జరపాలి

*(2)*: ప్రతి మరణానికి సంబంధించిన మెడికల్ రికార్డులు, చికిత్స వివరాలు, ICU రికార్డులు, బిల్లులను పరిశీలించాలి

*(3)*: అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలి

*(4)*: ఆర్థిక అవకతవకలు లేదా ఇతర నేరపూరిత అంశాలు ఉంటే ED, CBI వంటి సంస్థల ద్వారా కూడా విచారణ జరపాలి

*(5)*: ఆసుపత్రి యాజమాన్యం, పెట్టుబడులు, సంబంధిత వ్యక్తులు/సంస్థల మధ్య ఆర్థిక సంబంధాలపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా పరిశీలించాలి

*(6)*: విచారణ నివేదికను ప్రజల ముందుంచాలి

“తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు ఇకపై కేవలం వార్తలుగా మిగిలిపోకూడదు. ప్రతి ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలి. మెడికవర్ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలి. వైద్య శాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలి.”అని మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు అన్నారు.

No comments:

Post a Comment