Monday, October 12, 2026

వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా IAS_

*వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా IAS*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 11:

వెట్టిచాకిరి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా హైదరాబాద్ కలెక్టరేట్‌లో ‘స్వేచ్ఛా రథం’ను ప్రారంభించి, వెట్టిచాకిరి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.దోపిడీని నివారించడానికి, కార్మికుల హక్కులను పరిరక్షించడానికి అవగాహన ప్రచారాలను ముమ్మరం చేయాలని, కార్మిక అడ్డాల వద్ద నిరంతర నిఘా ఉంచాలని ఆమె అధికారులను ఆదేశించారు.వెట్టిచాకిరికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద సంఘటన కనిపిస్తే, వెంటనే 080-69434343 అనే టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆమె ప్రజలను కోరారు.ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా వెట్టిచాకిరి చేయిస్తే వారికి చట్టపరమైన శిక్షలు, జరిమానాలు ఉంటాయి అని అన్నారు.బాధితులను గుర్తించడానికి, వారికి సకాలంలో సహాయం మరియు రక్షణ కల్పించడానికి ప్రజల సహకారం అత్యంత కీలకం.

No comments:

Post a Comment